హిజ్రాతో ఎఫైర్.. నో అన్న యువకుడి గతి ఇదీ!

ఇదో విచిత్రమైన కేసు. హిజ్రాతో సహజీవనం చేసి తరువాత మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన యువకుడి కథ. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన విచిత్రంగా ఉంది. ఎక్కడైనా యువతీ యువకులు ప్రేమలో పడడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ హిజ్రా యువకుడితో సహజీవనం చేసింది. కొంత కాలం సాగిన వీరి ప్రేమాయణం చివరికి పెళ్లికి చేరలేదు. మధ్యలో మరో యువతితో సదరు యువకుడు కలిసి నడిచేందుకు సిద్ధమయ్యాడు. […]

Written By: Srinivas, Updated On : August 6, 2021 5:41 pm
Follow us on

ఇదో విచిత్రమైన కేసు. హిజ్రాతో సహజీవనం చేసి తరువాత మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన యువకుడి కథ. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన విచిత్రంగా ఉంది. ఎక్కడైనా యువతీ యువకులు ప్రేమలో పడడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ హిజ్రా యువకుడితో సహజీవనం చేసింది. కొంత కాలం సాగిన వీరి ప్రేమాయణం చివరికి పెళ్లికి చేరలేదు. మధ్యలో మరో యువతితో సదరు యువకుడు కలిసి నడిచేందుకు సిద్ధమయ్యాడు. దీంతో హిజ్రా రంగ ప్రవేశం చేసి పెళ్లిని ఆపిన వైనం వెలుగులోకి వచ్చింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన మగ్బూల్, వినీత్ ఇద్దరు స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కలిసి తిరిగారు. ఏది చేసినా ఇద్దరు చేసేవారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే మగ్బూల్ కు ఒకరికే ఉద్యోగం రావడంతో వినీత్ ఇంటి వద్దే ఉండేవాడు. మగ్బూల్ ఆర్మీలో చేరి ఉద్యోగం చేసేవాడు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇద్దరు కలుసుకునే వారు. అయితే ఈ మధ్య వినీత్ హిజ్రాగా మారాడు. వినీత్ ను చూసి మొదట ఆశ్చర్యపోయిన మగ్బూల్ యథావిధిగా కలుసుకునేవారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరికి ఇష్టం ఏర్పడింది. దీంతో కొంతకాలం సహజీవనం చేశారు.

దీంతో ఆర్మీ ఉద్యోగి మగ్బూల్ కు ఆయన తల్లిదండ్రులు ఓ యువతితో పెళ్లి కుదిర్చారు. గురువారం పెళ్లి తంతు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో హిజ్రా స్నేహితులు రంగంలోకి దిగి పెళ్లిని ఆపేశారు. మగ్బూల్ హిజ్రాతో కలిసి ఉండడాన్ని గుర్తు చేశారు. దీంతో నివ్వెరపోయిన పెళ్లి కుమార్తె బంధువులు పెళ్లిని ఆపి వెళ్లిపోయారు. ఈ పరిణామాలతో హిజ్రా ఆత్మహత్యా యత్నం చేసింది. ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ నేపథ్యంలో పెళ్లి కొడుకు తమను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూశాడని పెళ్లి కూతురు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిజ్రాతో సహజీవనం చేసి చివరికి మా పిల్లను సైతం మోసం చేసేందుకు పథకం వేశాడని పెళ్లికూతురు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మగ్బూల్ ను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.