
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 81,505 నమూనాలను పరీక్షించగా 2,209 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,78,350కి చేరింది. తాజాగా 22 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,490కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. 1,896 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,593 యాక్టివ్ కేసులు ఉన్నాయి.