https://oktelugu.com/

Divvela Madhuri : దువ్వాడతో ఫిజికల్ గా కలిశారా అంటే… దువ్వాడ ప్రేయసి మాధురి సంచలన నిజాలు వైరల్!

ఆమెకు 35.. ఆయనకు 50 ప్లస్. అయితే నేమ్ ఆ జంట తెలుగు నాట ఉర్రూతలూగిస్తోంది. సినిమా జంటకు కాదని వారి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.. అది దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట అని..

Written By:
  • Dharma
  • , Updated On : October 8, 2024 / 12:52 PM IST

    Divvela Madhuri Comments

    Follow us on

    Divvela Madhuri :  లేటు వయసులో ఘాటు ప్రేమ.. కానీ వారు సృష్టిస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా కపుల్స్ అంటే వారి పేరే చెబుతారు. ఆ జంటకు సోషల్ మీడియాలో అంత క్రేజీ ఏర్పడింది. వారి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట. ఇందులో మాధురి ఒక్క పోస్ట్ చేస్తే చాలు.. మిలియన్స్ లో వ్యూస్ రావాల్సిందే. ఆమె ఇంటర్వ్యూ ఇస్తే చాలు సంచలన అంశాలు బయటకు వస్తాయి. ఇక సడన్ గా ఆ జంట తిరుమల శ్రీవారి సన్నిధిలో కనిపించారు. లక్షలాదిమంది భక్తులు వారిని చూసి తరించారు. అంతటితో ఆగక వారు శ్రీవారి పుష్కరిణి దగ్గర ఫోటోషూట్ కూడా పూర్తి చేశారు. తమ పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ కీలక నేత దువ్వాడ శ్రీనివాస్ కు పొలిటికల్ కెరీర్ కంటే.. ఇప్పుడు వ్యక్తిగత ఫాలోయింగ్ పెరిగింది. ఆయన సతీమణి దువ్వాడ వాణి తో ఆయనకు వివాదం ఏర్పడింది. దీనికి కారణం మాధురి అంటూ ఆమె మీడియాను ఆశ్రయించారు. 20 రోజులపాటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద దీక్ష చేపట్టారు. తన తండ్రి మాధురితో కలిసి సహజీవనం చేస్తున్నారని స్వయంగా శ్రీనివాస్ కుమార్తెలు ఆరోపించడంతో ఇది మరింత సంచలనాంశంగా మారిపోయింది. అయితే ఈ మొత్తం వివాదానికి మాధురి కారణమని స్పష్టమైంది. అయితే చివరకు అదే మాధురికి కొత్త ఇంటిని రాసిచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ఎన్నికలకు ముందు రెండు కోట్ల రూపాయల అప్పు తీసుకున్నానని చెప్పుకొచ్చారు.. ఆ అప్పునకు బదులుగా ఇంటిని రాసిచ్చానని స్పష్టం చేశారు. దీంతో మాధురి ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాణి తన పిల్లలతో వెనక్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆ జంట తమ పెళ్లి పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

    * ఓ డాన్స్ మాస్టర్ గా..
    మాధురి టెక్కలి లో డాన్స్ మాస్టర్. తన సోషల్ మీడియా పేజీల ద్వారా.. వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసేవారు. ఈ వివాదం సమయంలో ఆమె డాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దువ్వాడ ఫ్యామిలీ వివాదం కొంత సద్దుమణిగింది. అదే సమయంలో వీరిద్దరూ చట్టా పట్టాలు వేసుకుని చక్కర్లు కొడుతుండడం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. మాధురి వంట చేస్తూ.. శ్రీనివాస్ గారికి ఈ వంట ఇష్టం.. పప్పు అంటే ఇష్టం.. ఇలా చేయడం ఇష్టం.. అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు. ఒకే బైక్ పై సైతం ఈ జంట కనువిందు చేసింది.

    * తొలిచూపులోనే లవ్ ట్రాక్
    తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు మాధురి. తాము తొలి చూపులోనే ప్రేమలో పడ్డామని చెప్పుకొచ్చారు. ఆయన పొలిటికల్ కెరీర్ చూసి తాను వలలో వేసుకున్నానన్న మాట తప్పు అని.. ఆయన భార్య వాణి జేజేతులా దువ్వాడ శ్రీనివాసును వదులుకుందని కూడా మాధురి చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ లో ఉన్న దూకుడు చూసి వాణి వలలో వేసుకుందని.. ఆవిడ వల్ల పొలిటికల్ కెరీర్ వచ్చిందన్నది తప్పు అని.. ఆమె ఏమైనా మంత్రి కూతురా అని ప్రశ్నించారు మాధురి. దువ్వాడ శ్రీనివాసులో హీరో క్వాలిటీస్ ఉన్నాయని.. అందుకే ఆయనను చూసి ఫీదా అయ్యానని కూడా చెప్పుకొచ్చారు.అందుకే ప్రేమలో పడ్డానని.. వాణితో విడాకులు ఇచ్చిన తర్వాత తన వాడిని చేసుకుంటానని కూడా చెబుతున్నారు. మొత్తానికి అయితే దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్లో ఇప్పుడు మాధురి హైలెట్ అవుతున్నారు. ఆ జంటకు విపరీతమైన క్రేజ్ కూడా ఏర్పడింది. ఆమె నుంచి వచ్చే మాటలుబాగా వైరల్ అవుతున్నాయి.