https://oktelugu.com/

Hijra: గోదావరిలో హిజ్రాల పూజలు.. ఇలా ఎందుకు చేస్తారు.. ఎవరి కోసం చేస్తారో తెలుసా..?

హిజ్రా ఈ పేరు వినగానే అంత దూరం పరిగెత్తుతాం. తాకడానికి కూడా ఇబ్బంది పడతాం. సమాజంలో వారిని వేరుగా చూస్తాం. చీదరించుకుంటాం. కానీ హిజ్రాలు మాత్రం సమాజం బాగుండాలనే కోరుకుంటారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 24, 2024 4:14 pm
    Hijra

    Hijra

    Follow us on

    Hijra: హిజ్రా లేదా ట్రాన్స్‌ జెండర్‌.. పేరు వేరైనా.. వారు ఒక్కటే. థర్డ్‌ జెండర్‌గా సమాజం భావిస్తున్న హిజ్రాలు సమాజంలో అనేక అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. సమాజంలో ఒకరిగా వారిని ఇప్పటికీ పరిగణించడం లేదు. ఇప్పుడిప్పుడే.. చాలా మంది సమాజంలో కలిసిపోతున్నారు. కొంత మంది వారిని గౌరవిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పథకాలు అందిస్తున్నాయి. ఓటుహక్కు కల్పించాయి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నాయి. దీంతో కాస్త గౌరవంగా బతుకున్నారు. అయితే సమాజం చీత్కరించడానికి కారణాలు కూడా ఉన్నాయి. తమను సమాజంలో ఒకరిగా చూడడం లేదన్న కోపంతో కొంత మంది హిజ్రాలు చేస్తున్న చేష్టల కారణంగా ఆ వర్గం మొత్తం అవమానాలకు గురవుతోంది. అయితే సమాజం వారిని దూరంగా కొట్టినా… వారు మాత్రం సమాజం బాగుండాలనే కోరుకుంటున్నారు. జనం కోసం పూజలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. మమ్మల్ని మనుషులుగా చూడకపోయినా మీరు బాగుండాలని, మీరు బాగుంటేనే మేము బాగుంటాం అన్న ఆలోచనలో సమాజం బాగుండాలని పూజలు, జాగారాలు చేస్తున్నారు.

    భద్రాచలంలో గోదావరికి పూజలు..
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో ఏటా సంభవించే వరదల కారణంగా తీవ్ర నష్టం జరుగుతుంది. ముఖ్యంగా భద్రాచలం పట్టణంలోకి సైతం వరద వస్తోంది. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీసీతారామచంద్రస్వామి దైవదర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రస్తుతం ఉన్న కరకట్టను పటిష్టం చేయడంతోపాటు మరికొంత దూరం పొడిగించారు. ఈ క్రమంలో గోదావరి కరకట్టను పటిష్ట పరిచి వదరల నుంచి భద్రాది పట్టణ వాసులను రక్షించాలని పట్టణానికి చెందిన కొందరు ట్రాన్స్‌ జెండర్లు గోదావరిలో ప్రత్యేక పూజలు చేశారు.

    కఠిన దీక్షతో పూజలు..
    హిజ్రాలు ఈ పూజ కోసం 24 గంటలపాటు కఠిన ఉపవాస దీక్ష చేశారు. రాత్రంతా జాగారం చేశారు. మంగళవాయిద్యాలతో భద్రాచలం పట్టణంలోని గోదావరి తీరానికి చేరుకున్నారు. ఓ హిజ్రా మాతంగులాగా చేసి ఆకుపచ్చని వస్త్రాలను ధరించి వెండి పాల బిందెతో పాలు తీసుకెళ్లి గోదావరిలో పోసి పూజలు చేసింది. పట్టణ ప్రజల శ్రేయసవ్సు కోసమే తాము ఈ పూజలు నిర్వహించామని తెలిపారు. తమ కోసం హిజ్రాలు పూజలు చేసిన విషయం తెలుసుకుని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.