WhatsApp: మంచి వెనక చెడు ఉన్నట్టు.. ఈ యాప్ ను మోసగాళ్లు డబ్బు సంపాదనకు సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారు. అమాయకులను బురిడీ కొట్టిస్తూ దర్జాగా వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. గతంలో మలేషియా, కెన్యా, వియత్నాం అంటే దేశాలకు చెందిన కోడ్స్ తో సైబర్ మోసగాళ్లు వాట్స్అప్ కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టించే మోసం చేశారు. వాట్సాప్ లో voip టెక్నాలజీ ఉంటుంది కాబట్టి.. స్కామర్లు ఎటువంటి చార్జీలు లేకుండానే ఇతర దేశాల నుంచి కాల్చేసే అవకాశం ఉంటుంది. దాని వల్ల వారు యూసర్లకు ఫోన్ చేసి.. రకరకాల ఎత్తుగడలు వేసి.. బ్యాంకు ఖాతాలు కాలు చేస్తున్నారు. అప్పట్లో మలేషియా +60, వియత్నం+84, కెన్యా+254, మాలి +223, ఇండోనేషియా +62 అంతర్జాతీయ కోడ్స్ తో ఫోన్లు చేసేవారు. వాస్తవానికి స్కామర్లు ఆ ప్రాంతాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు. కాకపోతే వీరు అమాయకులను మోసం చేయడానికి వాట్సప్ ను ఉపయోగిస్తారు. వాట్సాప్ లో ఎండు టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆఫర్ ఉంటుంది కాబట్టి.. స్కామర్లను ట్రేస్ చేయడం కష్టంగా ఉంటుందని తెలుస్తోంది. అందువల్లే స్కామర్లు వాట్సాప్ ను ఉపయోగించి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని సమాచారం. ఇక ఈ తరహా మోసాలు ఇటీవల పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వాట్సప్ మాతృ సంస్థ మెటా కంపెనీకి నోటీసులు పంపింది. స్కామర్లు వాట్సాప్ ను ఉపయోగించి స్క్రీన్ షేర్ అడగడం, ఓటిపి పంపి దానిని చెప్పమని అడగడం.. ఆ తర్వాత రిమోట్ యాక్సిస్ పొంది మోసం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదులు పెరిగాయి.
కేంద్రం ఏం చేస్తోందంటే..
వాట్సప్ అనేది ఓటిటి యాప్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం విభాగం కిందికి రాదు. దీనిని meit Y పర్యవేక్షిస్తోంది. వాట్సాప్ లో జరుగుతున్న మోసాలపై ట్రాయ్ కి ఫిర్యాదుల పరంపర వెళ్లడంతో.. ఆ విభాగం స్పందించింది. “ప్రస్తుతం వాట్సాప్ కాల్స్ ను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం పరిశీలిస్తోంది. మేము కూడా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని” ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటి పేర్కొన్నారు. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం విభాగం అడిగిన సమాచారానికి కొంతమేర వాట్సాప్ సహకరిస్తున్నది. ఇప్పటికే కొన్ని నెంబర్లను బ్లాక్ చేసింది. ప్రభుత్వం సూచించిన నెంబర్లను నిషేధిత జాబితాలో పెట్టింది. అయితే టెలిగ్రామ్, సిగ్నల్ ఫ్లాట్ ఫారంలపై కేంద్రం చెప్పిన విధంగా నియంత్రణ సాగించడం లేదని తెలుస్తోంది.
ఆ యూజర్లకు ఇబ్బంది
ఎయిర్టెల్, రిలయన్స్, జియో, వోడాఫోన్ ఐడియా ఆపరేటర్ల సర్వీసులు వాడుతున్న యూజర్లు స్పామ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ట్రాయ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం చర్యలు తీసుకోవడానికి అడుగులు వేసినప్పటికీ స్కామర్లు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. స్కామర్లపై టెల్కోలకు నియంత్రణ లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతుంది. వీటిపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత నెంబర్లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వ రంగా టెలికం సంస్థలు టెల్కోలకు సూచిస్తున్నాయి. ఆ కంపెనీలు ఆ నెంబర్లను బ్లాక్ చేసినప్పటికీ సమస్య మళ్ళీ పునరావృతమవుతోంది. స్కామర్లు అడిగినట్టుగా ఓటిపి నెంబర్లను యూజర్లు చెప్పకుంటే ఈ స్థాయిలో మోసాలు జరగవని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా విదేశాల నుంచి వచ్చే కాల్స్ ను ఎత్తకపోవడమే మంచిదని సూచిస్తున్నారు
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Are you using whatsapp are you aware of these warnings from the central government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com