Apps: మెసేజ్, ఫోటో, వీడియో కాల్, డాక్యుమెంట్ అప్లోడ్, వన్ జీబీ సామర్థ్యం ఉన్న ఒక మోస్తరు వీడియో.. లైవ్ లోకేషన్ పంపించే వెసలు బాటు.. ఇన్ని సౌకర్యాలున్నాయి కాబట్టే వాట్సప్ విశేష ప్రాచుర్యం పొందింది. మూడు బిలియన్ లకు మించిన యూజర్లతో సరికొత్త మెసేజింగ్ యాప్ గా అవతరించింది.. ఇంకా కొత్త కొత్త మార్పులతో యూజర్లను ఆకట్టుకుంటున్నది. భవిష్యత్తులోనూ యూజర్లకు సరికొత్త అనుభూతి కలిగించేందుకు మరిన్ని మార్పులు చేస్తామని చెబుతోంది. తాజాగా ఏఐ సౌలభ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో యూజర్లు పండగ చేసుకుంటున్నారు. అయితే వాట్సప్ కు మించిన మెసేజింగ్ యాప్ లేదా? భవిష్యత్తులో వాట్సాప్ కు ప్రత్యామ్నాయం లేదా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. గూగుల్ ప్లే స్టోర్లో వాట్సాప్ కు మించిన మెసేజింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. వాట్సప్ వాడకం తారా స్థాయికి చేరిన నేపథ్యంలో చాలామందిని వాటిని ఉపయోగించడం లేదు. ఒకసారి వాటిని వాడితే జన్మలో వాట్సప్ జోలికి పోరు.
మెసెంజర్
ఫేస్ బుక్ ఈ యాప్ ను రూపొందించింది.. మెటా ప్లాట్ ఫారం దీనిని డెవలప్ చేసింది. ఫోటోలు, వీడియోలు, వీడియో కాల్, స్టిక్కర్లు, ఆడియో, వివిధ రకాల ఫైల్స్ పంపించేందుకు దీనిని ఉపయోగించవచ్చు.. దీనిలో చాట్ బాట్ ఇంటర్ ఆక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి. అద్భుతమైన నాణ్యతతో వాయిస్, వీడియో కాల్ చేసుకునే అవకాశం దీని ద్వారా ఉంది.
స్కైప్
కోవిడ్ సమయంలో ఈ యాప్ వినియోగం చాలా పెరిగింది. నమ్మకమైన వాయిస్, వీడియో కాల్స్ కు ఈ యాప్ పెట్టింది పేరు. గ్రూప్ వీడియో చాట్ కూడా చేసుకోవచ్చు. Windows, MSc OS, iOS, iPad OS, Android, BlackBerry వంటి వాటికోసం Skype ఉచితంగా వీడియో సేవలు అందిస్తామని 2013 జూన్ 17న ప్రకటించింది. దీంతో వాటి యూజర్లకు స్కైప్ సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. ఇది ఆఫీస్ మీటింగ్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంది.
టెలిగ్రామ్
వాట్సప్ తర్వాత భారత దేశంలో రెండవ అతిపెద్ద వినియోగదారులను కలిగి ఉన్న సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్. సెన్సార్ పవర్ నివేదిక ప్రకారం భారత్లో ఈ యాప్ ను దాదాపు పది మిలియన్ల కస్టమర్లు ఉపయోగిస్తున్నారు. ఇది అద్భుతమైన నెట్వర్కింగ్ ఫీచర్లను కలిగి ఉంది. యూజర్లు తమ కథనాలను పోస్ట్ చేసేందుకు గరిష్టంగా రెండు లక్షల మంది సభ్యులతో అతిపెద్ద పబ్లిక్ గ్రూప్ లు ఏర్పాటు చేసేందుకు ఇందులో అవకాశం ఉంటుంది. అతిపెద్ద ఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు. రహస్యంగా చాటింగ్ కూడా జరపవచ్చు.
సిగ్నల్
అప్పటికప్పుడు తక్షణమైన సందేశాన్ని దీని ద్వారా పంపొచ్చు. వాయిస్ కాల్, వీడియో కాల్ కోసం ఈ యాప్ ను రూపొందించారు. ఇన్స్టంట్ మెసేజింగ్ ఫంక్షన్ లో టెక్స్ట్, వాయిస్ నోట్స్, ఫోటోలు, వీడియోలను, ఇతర ఫైల్స్ వెంటనే పంపేందుకు అవకాశం ఉంటుంది. వన్ టు వన్ గ్రూప్ మెసేజింగ్ చేయడం ఈ యాప్ ప్రత్యేకత.
వైర్
ఇది ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్. వీడియో కాల్, కాన్ఫరెన్స్ కాల్, ఫైల్ షేరింగ్ వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఇది వ్యక్తిగత గోప్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ యాప్ లో ఒకేసారి గరిష్టంగా 25 మంది గ్రూప్ కాలింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ లో 12 మంది ఒకేసారి పాల్గొనవచ్చు.
వైబర్
ఇది హై ఎండ్ వాయిస్ కాల్, వీడియో కాల్ సదుపాయాన్ని అందిస్తుంది. ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సౌలభ్యం ఇందులో ఉంటుంది. అతిపెద్ద ఫైల్ దీని ద్వారా షేరింగ్ చేయవచ్చు. ఇంటర్నేషనల్ ల్యాండ్ లైన్, మొబైల్ కాల్ మీ సేవలో కోసం Viber out అనే ఆప్షన్ ఇందులో అందుబాటులో ఉంది.
హైక్
ఇది ఇండియన్ యాడ్ వేర్ అప్లికేషన్. ఇది టెక్స్ట్, వాయిస్, వీడియో కమ్యూనికేషన్ కోసం విస్తృతంగా ఉపయోగపడుతుంది. దీనిని మల్టీ ఫంక్షనల్ యాప్ అని పిలుస్తారు. ఇన్స్టంట్ మెసేజింగ్, వాయిస్ ఓవర్ సేవలు దీని ద్వారా పొందొచ్చు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More