Telangana Politics: దేశంలో రాజకీయాలు మారుతున్నాయి. సమీకరణల్లో భారీ మార్పులు వస్తున్నాయి. బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే క్రమలో టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు మూడో కూటమి యత్నాలు ముమ్మరం అవుతున్నాయి. దీంతో ముందస్తు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెబుతున్న క్రమంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
దీనిపై మంత్రి కేటీఆర్ మాత్రం ఖండిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంతో ఈసారి కూడా అలాగే చేస్తారని అందరిలో అంచనాలు ఉన్నా ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కేటీఆర్ స్పష్టం చేస్తుండటంతో అందరి అనుమానాలకు ఓ స్పష్టత వచ్చినట్లు అయింది.
Also Read: బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. టీసీఎస్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు?
మరోవైపు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చురుగ్గా కదులుతుండటంతో ముందస్తు ఎన్నికలపై అందరిలో అనుమానాలు రావడం సహజమే. నవంబర్ లో గుజరాత్ కు 2023 ఏప్రిల్ లో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సందర్భంలో తెలంగాణ కూడా ఎన్నికలకు వెళ్తుందేమోననే సంశయాలు అందరిలో వస్తున్నాయి. కానీ అలాంటిది ఏమీ లేదని తేలడంతో ముందస్తు ఎన్నికల వైపు ప్రభుత్వం వెళ్లదనే వాదన కూడా వస్తోంది.
అయితే ఇప్పుడు అధికారం దోబూచులాడుతోంది. సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి చేయి కాల్చుకోవడం ఎందుకని టీఆర్ఎస్ భావిస్తోంది. ఏదిఏమైనా ఐదేళ్లు అధికారంలో ఉండి తరువాత జరిగే పరిణామాలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందస్తు వెళ్లి అధికారం కోల్పోవడం కంటే పూర్తిస్థాయిలో అధికారం అనుభవించడమే మేలనే వాదన కూడా వస్తోంది.
తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల సందర్భంలో మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలు లేవని చెబుతున్నా ప్రతిపక్షాలు మాత్రం విశ్వసించడం లేదు. కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారనే జోస్యం చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో అన్ని పార్టీలకు ముందస్తు జ్వరం పట్టుకుంది. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే తీసుకోవాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. టీసీఎస్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు?