https://oktelugu.com/

Alia Bhatt: ఆ విషయంలో నాకు శ్రీదేవే స్ఫూర్తి – ఆలియా భట్

Alia Bhatt:  పాన్ ఇండియా నటి కావాలనేదే తన కల అని బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ చెప్పింది. ఈ విషయంలో తనకు శ్రీదేవి స్ఫూర్తి అని.. ఆమె తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఏ భాషలో తీసుకున్నా స్టార్ గానే వెలిగారని పేర్కొంది. ‘గంగూబాయ్ కథియావాడి’ కోసం చాలా కష్టపడ్డానని, మూడేళ్లు ఆ సినిమాతో ప్రయాణం చేశానని చెప్పింది. కాగా, ఈ నెల 25న గంగూబాయ్ కథియావాడి సినిమా విడుదల కానుంది. మొత్తానికి ‘గంగూబాయ్ కథియావాడి’ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 21, 2022 / 03:02 PM IST

    Alia Bhatt

    Follow us on

    Alia Bhatt:  పాన్ ఇండియా నటి కావాలనేదే తన కల అని బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ చెప్పింది. ఈ విషయంలో తనకు శ్రీదేవి స్ఫూర్తి అని.. ఆమె తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఏ భాషలో తీసుకున్నా స్టార్ గానే వెలిగారని పేర్కొంది. ‘గంగూబాయ్ కథియావాడి’ కోసం చాలా కష్టపడ్డానని, మూడేళ్లు ఆ సినిమాతో ప్రయాణం చేశానని చెప్పింది. కాగా, ఈ నెల 25న గంగూబాయ్ కథియావాడి సినిమా విడుదల కానుంది.

    Alia Bhatt

    మొత్తానికి ‘గంగూబాయ్ కథియావాడి’ ప్రమోషన్స్ కోసం ఆలియా బాగా కష్టపడుతుంది. ఏది ఏమైనా బాలీవుడ్ లో హీరోయిన్ గా అలియా భట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తెలుగు స్టార్ట్స్ పై క్రేజీ కామెంట్స్ చేస్తూ వస్తోంది. తెలుగు నటీనటులతో కలిసి నటించాలని ఉంది అంటూ మొత్తానికి తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

    Also Read:  పెళ్ళికి రెడీ అయిన హీరో.. అమ్మాయి ఎవరేంటే.. ?

    రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మని టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎవరు ఇష్టమని ఓ యాంకర్ ప్రశ్నించగా, కొద్దిసేపు ఆలోచించిన అలియా వెంటనే సమంత పేరు చెప్పుకొచ్చింది. సామ్ ఒప్పుకుంటే ఆమెతో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమని, ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ నటనకు తాను ఫిదా అయ్యానని, అవకాశం వస్తే ఆమెతో కలిసి థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పిన సంగతి తెలిసిందే.

    Alia Bhatt

    అంతకుముందు, అల్లు అర్జున్‌తో పనిచేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పింది. అన్నట్టు ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాను అని అలియా భట్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.’యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా సినిమాలో.. ఎన్టీఆర్ సరసన ఆలియా హీరోయిన్ గా నటించనుంది.

    మొత్తానికి ఆలియా నిజమైన పాన్ ఇండియా స్టార్ గా ఫుల్ డిమాండ్ తో దూసుకుపోతుంది . ఎలాగూ ఎన్టీఆర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది కాబట్టి.. ఆమె క్రేజ్ సౌత్ లో పీక్స్ లోకి వెళ్లడం ఖాయం. అందుకే, సౌత్ స్టార్ హీరోలంతా ఇప్పుడు ఆలియా తమ పక్కన నటించాలని కోరుకుంటున్నారు.

    Also Read: బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. టీసీఎస్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు?

    Tags