Mamata Banerjee : ఓ రాష్ట్రాన్ని సాశించే అధికారం ఉండే పదవి ముఖ్యమంత్రి పదవి. ఈ పదవి చేతిలో ఉంటే రాష్ట్రాన్ని మొత్తం శాసించవచ్చు. ఒక్కసారి సీఎం అయితే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు సంపాదిస్తారు కొందరు. ఓ రాష్ట్రానికి మూడుసార్లు సీఎంగా ఉండి కూడా పెద్దగా ఆస్తులు లేకపోతే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అయితే రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత పదవి ముఖ్యమంత్రిదే కదా. కనీసం ఒక్కసారి అయినా సీఎం అవ్వాలి అని చాలా మంది నాయకులు కోరుకుంటారు. కానీ ఓ మహిళ ముఖ్యమంత్రి మూడు సార్లు ఓ రాష్ట్రాన్ని ఏలుతుంది. ముఖ్యమంత్రికి ముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసింది. ఇలా అత్యున్నత పదవులు చేపట్టినా ఆమె ఆస్తులు మాత్రం జస్ట్ లక్షల్లోనే ఉన్నాయట. మరి ఆమె ఎవరో కాదు మమతా బెనర్జీ.
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దేశంలోని అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను తెలిపింది. ఇందులో అత్యల్ప ఆస్తులు ఉన్న సీఎం గా నిలిచింది మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆమె ఆస్తులు చాలా తక్కువగా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.
ఎన్నికల సమయంలో నామినేషన్ తో పాటు అఫిడవిట్ సేకరించాల్సి ఉంటుంది. అయితే దీని ఆదారంగా ఈ వివరాలను సేకరించింది ఏడిఆర్. అంటే మమతా బెనర్జీ తనకు తానే పేద సీఎంగా ప్రకటించింది అన్నమాట. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి కూడా ఆమె కేవలం లక్షల విలువైన ఆస్తులు మాత్రమే కలిగి ఉందంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ముఖ్యమంత్రుల ఆస్తుల జాబితాలో మమతా బెనర్జీ చివరన ఉంది. ఆమె ఆస్తిపాస్తుల మొత్తం కేవలం 15,38,029 రూపాయలు మాత్రమే.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేస్తున్న ఈ సీఎం శాలరీ తీసుకోవడం లేదట. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జీతం తీసుకోనని తెలిపింది. అయితే ఈమె ఒక రూపాయి మాత్రమే తీసుకుంటాను అని తెలిపింది. ఇప్పుడు కూడా ఒకటే రూపాయి తీసుకుంటుంది.
ఇదిలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆస్తులతో ఈ జాబితాలో మొదటిస్థానంలో ఉన్నారు. చంద్రబాబు కుటుంబ ఆస్తులు ఏకంగా 931 కోట్ల రూపాయలు ఉన్నాయి అని సమాచారం. ఇంత భారీగా ఆస్తులు ఉన్న ఆయన భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఆ లిస్టులో రెండవ స్థానంలో నిలిచారు. ఆయన కుటుంబ ఆస్తిపాస్తులు రూ.332 కోట్లుగా నివేదిక పేర్కొంది. అయితే ఈ సీఎంకు అత్యధికంగా అప్పులు కూడా ఉన్నాయట. ఏకంగా రూ.180 కోట్ల వరకు అప్పు ఉందని సమాచారం. ఇక మూడవ స్థానాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీసుకున్నారు. ఈయన ఆస్తులు రూ.51 కోట్లు అయితే అప్పులు 23 కోట్లు అని సమాచారం.