https://oktelugu.com/

Chandrababu – Revanth Reddy : విదేశీ గడ్డపై చంద్రబాబు వర్సెస్ రేవంత్.. పెట్టుబడుల కోసం యుద్ధం!

రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడం ముఖ్యమంత్రుల విధి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య గట్టి ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఇందుకు ప్రపంచ పెట్టుబడుల సదస్సు వేదిక కానుంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 2, 2025 / 09:27 AM IST

    Chandrababu - Revanth Reddy

    Follow us on

    Chandrababu – Revanth Reddy : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం కొనసాగుతోంది. పరస్పర రాజకీయ విరుద్ధ ప్రభుత్వాలు ఉన్నా సఖ్యత మాత్రం కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తరువాత సానుకూల వాతావరణం ఏర్పడింది. గత ఐదేళ్ల కిందట ఏపీలో జగన్, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వాలు నడిచాయి. వారి మధ్య స్నేహం రాజకీయాల వరకే పరిమితం అయ్యింది కానీ.. రాష్ట్రాల ప్రయోజనాలకు ఎంత మాత్రం ఉపయోగపడలేదన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాయి. అయినా సరే రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణమే నడుస్తోంది. దానికి కారణం చంద్రబాబు, ఆయన ఒకప్పటి సన్నిహితుడు రేవంత్ రెడ్డి.

    * దావోస్ సదస్సులో
    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ రెండుసార్లు కలిశారు. కలిసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మరోసారి విదేశీ గడ్డపై కలవనున్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఎదురెదురు పడనున్నారు. ఈనెల 20 నుంచి ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ క్రీడా ప్రాంగణాలను పరిశీలించనున్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ ని కూడా సందర్శించనున్నారు. అక్కడి నుంచి అటు దావోస్ సదస్సుకు రానున్నారు.

    * ఇద్దరి మధ్య పోటా పోటీ
    ఏపీ సీఎం చంద్రబాబు సైతం తన మంత్రివర్గ సహచరులతో వెళ్ళనున్నారు. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగనంది. దీంతో ఇద్దరి నేతల సామర్థ్యం తేలిపోనుంది. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వస్తాయా? తెలంగాణ తనుకు పోతుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గత ఏడాది జనవరిలో జరిగిన పెట్టుబడుల సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 40 వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సాధించారు. అదే సమయంలో ఏపీ నుంచి ఎటువంటి ప్రభావం లేకుండా పోయింది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి ఓటమికి అది కూడా కారణం. దీంతో చంద్రబాబు రేవంత్ కి మించి పెట్టుబడులు తెస్తారా? ఆ పరిస్థితి ఉందా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది.

    Tags