https://oktelugu.com/

Andhra Pradesh : కూటమిలో చిచ్చు.. ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు.. ఇలా అయితే కష్టం!

కూటమిలో చాప కింద నీరులా విభేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో ఎంపీలు విభేదిస్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంటుంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 2, 2025 / 09:39 AM IST

    alliance mp's vs mla's

    Follow us on

    Andhra Pradesh :  ఏపీలో మరో దశాబ్ద కాలం పాటు పొత్తులు కొనసాగాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. అప్పుడే డ్యామేజ్ జరిగిన ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం బాగా కుదిరిందని అభిప్రాయపడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులను కలుపుకెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చాలాచోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వస్తోంది. విభేదాలతో నేతలు రోడ్డుపై పడాల్సి వస్తోంది. ఇటీవల రెండు కీలక పార్లమెంట్ స్థానాల్లో ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు పరిస్థితి మారింది. విభేదాలు బయటపడటం చర్చకు దారితీసింది. బాపట్ల పార్లమెంట్ స్థానంలో ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి మధ్య రాజకీయ సమరం నడుస్తోంది. మరో స్థానంలో సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది.

    * మచిలీపట్నంలో అలా
    రాష్ట్రంలో రెండు చోట్ల జనసేన ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం ఎంపీగా జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి ఎన్నికయ్యారు. ఇక్కడ ఎంపీ తో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు విభేదిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. బాపట్లలో ఎంపీ అనుచరులకు, ఎమ్మెల్యే అనుచరులకు గొడవలు కూడా జరిగాయి. ఎంపీ అనుచరులకు చెందిన ఓ ట్రాక్టర్ ను ఎమ్మెల్యే అనుచరులు కాల్చేశారు. భౌతిక దాడికి సైతం దిగారు. ఈ పరిణామం నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో కూటమి నేతల మధ్య మద్యం సిండికేట్ విషయంలో విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఎంపీకి, ఇద్దరు కీలక ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో నాలుగు షాపులకు తాళం వేసినట్లు సమాచారం.

    * విజయవాడ పార్లమెంట్ స్థానంలో..
    విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో సైతం విభేదాల పర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎంపీ తో రిజర్వ్ నియోజకవర్గం ఎమ్మెల్యే విభేదిస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనా.. వివిధ అంశాల్లో విభేదించుకుంటున్నారు. ముఖ్యంగా పంపకాల విషయంలో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సదరు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూటమి పార్టీల్లో ఒక రకమైన భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విభేదాలను చక్కదిద్దకపోతే.. వివాదం ముదిరి అసలు తెస్తుందన్న భయం వెంటాడుతోంది. మరి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.