తెలుగు ముఖ్యమంత్రులు క్వారంటైన్ లో ఉన్నారా!

రాజకీయంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ కరోనాను కట్టడి చేసే విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆయన వలే వీరిద్దరూ కూడా గత నెలన్నర రోజులుగా దాదాపు తమ అధికార అనివాసాలకే పరిమితమై ఉంటున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో తమ అధికార నివాసాలను దాటి బైటకు వచ్చిన్నట్లు ఎక్కడ కనబడటం లేదు. దానితో వారిద్దరూ స్వీయ నిర్బంధంలో ఉన్నారా అంటూ ప్రతిపక్ష నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 4:01 pm
Follow us on


రాజకీయంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ కరోనాను కట్టడి చేసే విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆయన వలే వీరిద్దరూ కూడా గత నెలన్నర రోజులుగా దాదాపు తమ అధికార అనివాసాలకే పరిమితమై ఉంటున్నారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో తమ అధికార నివాసాలను దాటి బైటకు వచ్చిన్నట్లు ఎక్కడ కనబడటం లేదు. దానితో వారిద్దరూ స్వీయ నిర్బంధంలో ఉన్నారా అంటూ ప్రతిపక్ష నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశాలతో సహా అన్ని అధికార సమీక్షలను అధికార నివాసంలోనే జరుపుతున్నారు.

అయితే వారికి, ప్రధాన మంత్రి మోదీకి ఒక్క విషయంలో విబేధం కనిపిస్తున్నది. తెలుగు ముఖ్యమంత్రులు అవసరమైనప్పుడు మంత్రులను, అధికారులను, ఇతరులను కలిసి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువగా సోషల్ మీడియా సందేశాలను, వీడియో కాన్ఫరెన్స్ లకు ప్రధాని పరిమితం అవుతున్నారు.

అయితే దేశంలో పలువురు ముఖ్యమంత్రులు కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నారు. అధికార యంత్రాంగానికి, ప్రజలకు భరోసా కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. 77 ఏళ్ళ వయస్సులో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యడ్డియూరప్ప తిరుగుతున్నారు. 65 ఏళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ మంగళవారం కలకత్తా వీధులలో తిరుగుతూ, కారులో నుండే ప్రజలు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు సహితం క్షేత్రస్దాయిలో కనిపిస్తున్నారు. ఉత్తరాదిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహితం ప్రజలకు దూరం కావడం కాకుండా క్రియాశీలకంగా తిరుగుతున్నారు. రాజస్థాన్, ఢిల్లీ, మేఘాలయ ముఖ్యమంత్రులు సహితం అధికార నివాసాలకు పరిమితం కావడం లేదు.

దేశంలో యువకుడైన ముఖ్యమంత్రిగా పేరొందిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం కావడంతో ‘మిస్సింగ్ ముఖ్యమంత్రి’ అంటూ కొందరు టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు మొదటినుండి అధికార నివాసానికి ఎక్కువగా పరిమితమవుతున్నా పాలనా యంత్రాంగంపై పర్యవేక్షణ చేస్తుండటం తెలిసిందే.