ఇమ్మిగ్రేషన్ రూల్స్ పై ట్రంప్ క్లారిటీ!

అమెరికాలోకి ఇమ్మిగ్రేషన్ గ్రీన్ కార్డుల ను రద్దు చేయడం పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. వీసాలను రెండు నెలలపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తాజా ఉత్తర్వులు అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వారిని మాత్రమే అడ్డుకుంటుందని, కానీ తాత్కాలిక ఉద్యోగుల్ని నిలువరించదని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటన వల్ల అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకునే వారు (గ్రీన్ కార్డు దారులు) ఇబ్బందుల్లో పడినట్లే… ట్రంప్ రూల్ అమల్లోకి రాగానే… వారు 60 […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 3:59 pm
Follow us on


అమెరికాలోకి ఇమ్మిగ్రేషన్ గ్రీన్ కార్డుల ను రద్దు చేయడం పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. వీసాలను రెండు నెలలపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

తాజా ఉత్తర్వులు అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వారిని మాత్రమే అడ్డుకుంటుందని, కానీ తాత్కాలిక ఉద్యోగుల్ని నిలువరించదని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ ప్రకటన వల్ల అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకునే వారు (గ్రీన్ కార్డు దారులు) ఇబ్బందుల్లో పడినట్లే… ట్రంప్ రూల్ అమల్లోకి రాగానే… వారు 60 రోజులపాటూ శాశ్వతంగా ఉండేందుకు అప్లై చేసుకోవడానికి వీలుండదు. 60 రోజుల తర్వాత ట్రంప్… ఆ నిషేధం కొనసాగిస్తారో లేక ఎత్తేస్తారో తెలియదు. అసలే అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న టైం. ఈ సమయంలో… స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి కొత్త రూల్ తేబోతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 819164కి చేరడం, మృతుల సంఖ్య 45వేలు దాటేయడంతో… ఈ కరోనాను ఎలా కంట్రోల్ చెయ్యాలన్నది అమెరికాకు పెద్ద తలనొప్పిగా సవాలుగా మారింది. ఐతే… అమెరికాలో వైద్య సేవల్లో పాల్గొంటున్న వారిలో విదేశీ వలసదారులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ట్రంప్… తన కొత్త రూల్ ‌లో వాళ్లకు మినహాయింపు ఇస్తారని తెలుస్తోంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆహార సరఫరాదారులపై కొత్త రూల్ ప్రభావం చూపదని తెలుస్తోంది.