Petrol and Diesel Prices: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధానికి అగ్రరాజ్యం అమెరికా అన్నివిధాలా సిద్ధమైంది. శుక్రవారం యుద్ధం మొదలవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈమేరకు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా ఉద్రిక్తతలు చమురు ధరలపై పడనున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
అమెరికా–ఇరాన్ వైరం ప్రభావం
అమెరికా – ఇరాన్ మధ్య పెరిగిన టెన్షన్లు చమురు ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. లండన్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.4%లు పెరిగి బ్యారెల్‌కు 70.06 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియట్ కూడా 2.6% పెరిగి 64.82 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది
ఇరాన్‌లో ఉత్పత్తి ఆటంకం
అమెరికా దాడి జరిగితే ఇరాన్ చమురు ఉత్పత్తి రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ వరకు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ ఆర్ముజ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉంది. అదే జరిగితే ప్రపంచ చమురు సరఫరా ప్రభావితం అవుతుంది.
భారత్‌పై ప్రభావం..
భారత్ చమురు దిగుమతిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ ధరల పెరుగుదల ప్రభావం తప్పక పడుతుంది. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లకు వెంటనే ప్రజలకు అనుకూలంగా ఉండదు. ఇప్పటికే దేశంలో పెట్రోల్ లీటర్‌కు సగటు 105 రూపాయలు, డీజిల్ 95 రూపాయల వద్ద ఉంది. మరో 5–10% పెరిగితే కుటుంబ బడ్జెట్లు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి.
అమెరికా – ఇరాన్ యుద్ధంతో పెట్రోల్ ధరలు పెరిగి, సరఫరా తగ్గితే ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించి ప్రజల భారాన్ని తగ్గించవచ్చు. రష్యా నుంచి ఇంధన సరఫరా నేపథ్యంలో భారత్‌పై ప్రభావం తక్కువగానే ఉంటుందని కూడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.