జగన్ పాలనపై కాపులు సంతృప్తితో ఉన్నారా?

కుల రాజకీయాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందనేది అందరికీ తెల్సిందే.. కుల ప్రాతిపదికగానే అక్కడి ఓటర్లు.. నాయకులను ఎన్నుకుంటారనడంలో అతిశయోక్తి కాదేమో.. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఎక్కువ కులాలు ఏ పార్టీకైతే మద్దతు ఇస్తాయో ఆ పార్టీనే ఏపీలో గద్దెనెక్కుతూ వస్తోంది. దీంతో ఏపీలో ఎక్కువ జనాభా కలిగిన కులాలకు ప్రాధాన్యత పెరిగింది. ఇక ఏపీలో కాపులు అత్యధికంగా ఉండటంతో వీరిని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు పదవుల్లో వారికే ప్రాధాన్యం […]

Written By: NARESH, Updated On : September 1, 2020 3:32 pm
Follow us on

కుల రాజకీయాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందనేది అందరికీ తెల్సిందే.. కుల ప్రాతిపదికగానే అక్కడి ఓటర్లు.. నాయకులను ఎన్నుకుంటారనడంలో అతిశయోక్తి కాదేమో.. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఎక్కువ కులాలు ఏ పార్టీకైతే మద్దతు ఇస్తాయో ఆ పార్టీనే ఏపీలో గద్దెనెక్కుతూ వస్తోంది. దీంతో ఏపీలో ఎక్కువ జనాభా కలిగిన కులాలకు ప్రాధాన్యత పెరిగింది. ఇక ఏపీలో కాపులు అత్యధికంగా ఉండటంతో వీరిని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు పదవుల్లో వారికే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి.

2014 ఎన్నికల్లో కాపులంతా టీడీపీ-జనసేన కూటమికి మద్దతు తెలపడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే టీడీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ విషయంలో కాపులకు హ్యండివ్వడంతో వారంతా కిందటి ఎన్నికల్లో జగన్ కు జై కొట్టారు. దీంతో వైసీపీ ఏపీలో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాపుల్లో కొందరు మాత్రం ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతు ఇచ్చారు. మెజార్టీ కాపులు వైసీపీ వైపు మొగ్గుచూపడంతో ఆపార్టీనే అధికారంలోకి వచ్చింది. గతంలో కాపు పార్టీగా తెరపైకి వచ్చిన ప్రజారాజ్యం స్థాయిలో కూడా జనసేనకు కాపు ఓట్లు రాకపోవడం గమనార్హం.

కాపుల కోసం ప్రస్తుత జగన్ సర్కారు అమలు చేస్తున్న పథకాలతో ఆవర్గం నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కన్పిస్తుంది. కాపు మహిళల్లో ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతుందనే టాక్ విన్పిస్తోంది. మహిళల కోసం జగన్ తీసుకొచ్చిన ‘కాపునేస్తం’ వారిని ఎంతగానో ఆకట్టుకుంటుందని సమాచారం. దీంతోపాటు కాపు కార్పొరేషన్ సకాలంలో నిధులు పెంచడం, సకాలంలో మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా కాపు రిజర్వేషన్ పై జగన్ స్పష్టమైన వైఖరి ప్రకటించడంతో కాపు ఓటర్లంతా జగన్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఆవర్గానికి చెందిన నేతలంతా ఇప్పటికే వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ఎన్నికల అనంతరం తోట త్రిమూర్తులు వైసీపీలో చేరగా తాజాగా పంచకర్ల రమేష్ బాబు, చలమలశెట్టి సునిల్ ఆపార్టీలో చేరారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 23మంది గెలుపొందగా అందులో కేవలం ఇద్దరు మాత్రమే కాపు నేతలు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టీడీపీపై కాపుల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ కాపులకు పెద్దపీఠ వేస్తోంది. కాగా ప్రస్తుతానికైతే కాపులంతా జగన్ వెంటే నడిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల వరకు కాపులు జగన్ తోనే ఉంటారా? అనేది వేచి చూడాల్సిందే..!