జగన్ సలహాదారులు పనిచేస్తున్నారా?

వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఏం ఫర్వాలేదు. ఏపీ ప్రభుత్వం విచిత్రకరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. రాష్ర్టానికి నలుగురు సలహాదారులున్నా చర్యలు మాత్రం శూన్యం. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేశంలోనే కరోనా ప్రభావిత రాష్ర్టాల్లో ఏపీ రెండో స్థాంలో ఉండడం గమనార్హం. ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీలో నలుగురు సలహాదారులున్నారు. దేవులపల్లి అమర్ తో […]

Written By: Srinivas, Updated On : May 30, 2021 11:44 am
Follow us on

వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఏం ఫర్వాలేదు. ఏపీ ప్రభుత్వం విచిత్రకరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. రాష్ర్టానికి నలుగురు సలహాదారులున్నా చర్యలు మాత్రం శూన్యం. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేశంలోనే కరోనా ప్రభావిత రాష్ర్టాల్లో ఏపీ రెండో స్థాంలో ఉండడం గమనార్హం.

ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీలో నలుగురు సలహాదారులున్నారు. దేవులపల్లి అమర్ తో సహా వారు కార్యకలాపాలు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై జాతీయ మీడియాలో వ్యతిరేక వార్తలు రాయకుండా చూడాల్సిన బాధ్యత అమర్ పై ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కేంద్రం నుంచి అందాల్సిన సాయం ఏపీకి సకాలంలో అందించే విషయంలో కూడా వీరు పట్టించుకోవడం లేదనే విషయం తెలుస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. రూ.లక్షల్లో వేతనం పొందుతున్నా పనుల్లో మాత్రం చొరవ చూపడం లేదు.

ప్రస్తుతం ఏపీకి రెమ్ డెసివర్ ఇంజక్షన్లు అవసరం ఉంది. కేంద్రమే వాటిని ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కరోనా సమయంలో కేంద్రంతో టచ్ లో ఉండాల్సిన సలహాదారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని తెలుస్తోంది. డిల్లీలో తమకు కేటాయించిన గదుల్లోనే సేద తీరుతున్నారనే విషయం తెలుస్తోంది. ఒకరిద్దరే ఉన్న తెలంగాణకు వ్యాక్సిన్లు లభిస్తుండగా ఏపీకి మాత్రం మొండిచేయి చూపిస్తున్నారని చెబుతున్నారు.

సలహాదారులు మాత్రం మరో పాట పాడుతున్నారు. తాము చెప్పినా ఎవరు స్పందించడం లేదని చెబుతున్నారు. నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతున్నా పనిచేయడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావడం లేదు. తాము సలహాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఏదిఏమైనా సలహాదారుల పాత్రపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.