బస్సు ఎక్కేందుకు రేడినా!

రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సర్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు బస్సుల్లో సీట్లు మధ్య సామాజిక దూరం పాటిస్తూ డీలక్స్ బస్సులో సింగిల్ సిట్టింగ్ మూడు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా సీట్లపై మార్క్ంగ్ చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ప్రారంభించింది, పల్లె […]

Written By: Neelambaram, Updated On : May 20, 2020 11:13 am
Follow us on


రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సర్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు బస్సుల్లో సీట్లు మధ్య సామాజిక దూరం పాటిస్తూ డీలక్స్ బస్సులో సింగిల్ సిట్టింగ్ మూడు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా సీట్లపై మార్క్ంగ్ చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ప్రారంభించింది, పల్లె వెలుగు బస్సులకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. బస్సులు అన్ని సింగిల్ స్టాప్ విధానంలో నడపబడతాయి. బస్సు బయలుదేరే ప్రదేశంలో ఎక్కడం, గమ్యస్థానంలో దిగేందుకు అవకాశం ఉంటుంది. మధ్యలో పాసింజర్లను ఎక్కించుకోవడం, దింపడం రెండింటికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.

బస్సు ఎక్కే, దిగే సమయాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే బస్సులో ప్రయాణించడానికి అవకాశం ఇవ్వరు. మరోవైపు స్పందన పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుని, వారి అభ్యర్థనను జిల్లా అధికార యంత్రాంగం అంగీకరించిన వారికే ఏపీఎస్‌ఆర్టీసీలో ప్రస్తుతం టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో బస్సులు నడిపి క్రమేణా వాటి సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని ఆర్టీసీ భావిస్తోంది.