భారతదేశంలోని టాప్ – 50 ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ మహిళా నేత!

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కె.వి ఉష శ్రీచరణ్ ఫేమ్ ఇండియా ఏషియా సర్వే పోస్ట్ వారు నిర్వహించిన సర్వే లో భారతదేశంలోని టాప్ -50 ఎమ్మెల్యేల లిస్టులో స్థానం దక్కించుకున్నారు. వైసిపి ఎమ్మెల్యే అయిన కె.వి ఉష శ్రీ చరణ్ అనంతపురం జిల్లా లోని కళ్యాణ దుర్గ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఇండియా ఏషియా సర్వే పోస్ట్ వారు నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో టాప్ 50 ఎమ్మెల్యేలలో ఒకరిగా […]

Written By: Kusuma Aggunna, Updated On : August 21, 2020 8:12 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కె.వి ఉష శ్రీచరణ్ ఫేమ్ ఇండియా ఏషియా సర్వే పోస్ట్ వారు నిర్వహించిన సర్వే లో భారతదేశంలోని టాప్ -50 ఎమ్మెల్యేల లిస్టులో స్థానం దక్కించుకున్నారు. వైసిపి ఎమ్మెల్యే అయిన కె.వి ఉష శ్రీ చరణ్ అనంతపురం జిల్లా లోని కళ్యాణ దుర్గ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఇండియా ఏషియా సర్వే పోస్ట్ వారు నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో టాప్ 50 ఎమ్మెల్యేలలో ఒకరిగా నిలిచారు.

ఫేమ్ ఇండియా సర్వే వారు పాపులారిటీ, సామాజిక బాధ్యత, ప్రజలపై ప్రభుత్వం పై ఆయా ఎమ్మెల్యేల ప్రభావం, ప్రతిపాదించిన బిల్లుల్లో వారి పాత్ర, ఎమ్మెల్యే ఫండ్ ఖర్చు పెట్టే విధానం తదితర అంశాలను నిర్దేశక కొలమానాలుగా తీసుకొని ఈ సర్వేను చేశారు. ఈ లిస్టులో మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే వెనుకబడిన తరగతికి చెందిన ఈ మహిళా ఎమ్మెల్యే… ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను కంటికి రెప్పలా కాపాడింది అని ఇప్పటికీ ఎంతమంది కొనియాడారు.

ఆమె అసెంబ్లీలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన నీటి సమస్యను అసెంబ్లీలో లేవనిత్తిన తీరు నిజంగా హైలైట్ అనే చెప్పాలి. అలాగే ఈ కరోనా కష్టకాలంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించడం…. తానే స్వయంగా వారి బాగోగులు చూడటం… అలాగే పోలీసులు, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలను, ఆహారాన్ని తానే దగ్గరుండి అందించడం…. ఇంకా మాస్కులు వంటి సేఫ్టీ పరికరాలను తన సొంత డబ్బులతో సహాయం చేయడం వంటివి ఎన్నో చేశారు. ఇలాంటి మనస్తత్వం గల ఆమె యొక్క సేవా భావన్ని పసిగట్టిన ప్రజలు దాదాపు 20 వేల ఓట్ల మెజార్టీతో 2019 లో భారీ విజయం అందించారు.