
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఇన్నాళ్లు మద్యం ధరల మీద ఆధారపడిన ప్రభుత్వం ప్రస్తుతం దాంతోనే ప్రజా ప్రయోజన పథకాలు చేపట్టాలని భావిస్తోంది. మద్యం ద్వారా వసూలైన డబ్బుతో సంక్షేమ పథకాలను నిర్వహించనుంది. ఇందుకు గాను ప్రణాళికలు రెడీ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని చూస్తోంది.
ఇన్నాళ్లు సంక్షేమ పథకాల అమలు బాధ్యత నిర్వహిస్తున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మద్యం కంపెనీకే అమలు బాధ్యత అప్పగించడం వెనుక మతలబు ఏముంటనే ఆలోచన అందరిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఏ మేరకు సఫలం అవుతారో తేలాల్సి ఉంది. దీనిపై ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్(AP Govt) స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ బీసీఎల్) ఇప్పుడు మద్యం అమ్ముతున్న కంపెనీ సంక్షేమ పథకాల బాధ్యతను చూడనుంది. ఇందకు గాను ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలు కాపాడే విధంగా సెప్టెంబర్ 3న ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఆసరా, అమ్మఒ:డి పథకాల అమలు బాధ్యత ఈ సంస్థే చూసుకోనుంది.
ఇక ఎపీఎస్ బీసీఎల్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రూ. వేల కోట్లు అప్పులుగా తీసుకొచ్చింది. మరిన్ని రుణాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. సంక్షేమ పథకాల అమలు బాధ్యతలను కంపెనీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం గమనార్హం. ఏపీఎస్ బీసీఎల్ కు అప్పగించడంతో ప్రభుత్వ నిర్వహణ కొత్త పుంతలు తొక్కనుందని తెలుస్తోంది.
మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ల అభివృద్ధే ధ్యేయంగా ఆదాయం వినియోగించేందుకు సంకల్పించింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను నిర్వహించేందుకు సిద్ధం కానుంది.
జగన్ సర్కార్ బిగ్ షాక్.. ఇండియన్ మెడికల్ డివైసెస్ రెడ్ నోటీసు
మద్యం బాటిళ్లు డార్క్ కలర్లోనే ఎందుకు ఉంటాయి..? ‘గూస్ బంప్స్’ అంటే ఏమిటి..?