https://oktelugu.com/

లండన్ మోడల్ అంబులెన్స్ సేవలు..!

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 108 అంబులెన్స్స్థా నంలో కొత్త వాహనాలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వాహనాలలో అధికశాతం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టినవే. దీంతో అవి మరమ్మతులకు నోచుకోక పాతవి అయిపోయాయి. వాటి స్థానంలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన వాహనాలను సిద్ధం చేస్తున్నారు. 1,060 కొత్త 108 సర్వీసులను సిద్ధం చేస్తున్నారు. గతంలో మండలానికి ఒకొక్క అంబులెన్స్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఈ సంఖ్యను రెట్టింపు చేసి ఒక్కో మండలానికి రెండు […]

Written By: , Updated On : May 14, 2020 / 05:35 PM IST
Follow us on

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 108 అంబులెన్స్స్థా నంలో కొత్త వాహనాలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వాహనాలలో అధికశాతం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టినవే. దీంతో అవి మరమ్మతులకు నోచుకోక పాతవి అయిపోయాయి. వాటి స్థానంలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన వాహనాలను సిద్ధం చేస్తున్నారు. 1,060 కొత్త 108 సర్వీసులను సిద్ధం చేస్తున్నారు.

గతంలో మండలానికి ఒకొక్క అంబులెన్స్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఈ సంఖ్యను రెట్టింపు చేసి ఒక్కో మండలానికి రెండు అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ లండన్ మోడల్ అంబులెన్స్ లతో గ్రామాల్లో అరోగ్య సేవలు అందిస్తారు. అదేవిధంగా టెలి మెడిసిన్‌ కోసం కొత్త బైకులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి ఈ కొత్త వాహనాలు సేవలు అందించనున్నాయి. పరిశీలించిన కోసం ఇప్పటికే కొన్ని వాహనాలు రప్పించారు.