8 కోట్ల వలస కూలీలకు లబ్ధి!

రూ.20 లక్షల కోట్లకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరిస్తున్నారు. రేషన్ కార్డులు లేని వాళ్లకు కూడా ఉచిత రేషన్ ఇచ్చి, దీనికింద 8 కోట్ల వలస కార్మికులు ప్రయోజనం పొందనున్నట్లు సీతారామన్ తెలిపారు. అంతేకాకుండా మరో 3500 కోట్ల రూపాయలు వలస కార్మికుల కొరకు ఖర్చు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు.  ఈ రోజు వలస కూలీలకు సంబంధించి సీతారామన్ మాట్లాడుతూ.. “సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు రూ.11 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించాం. […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 9:18 pm
Follow us on

రూ.20 లక్షల కోట్లకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరిస్తున్నారు. రేషన్ కార్డులు లేని వాళ్లకు కూడా ఉచిత రేషన్ ఇచ్చి, దీనికింద 8 కోట్ల వలస కార్మికులు ప్రయోజనం పొందనున్నట్లు సీతారామన్ తెలిపారు. అంతేకాకుండా మరో 3500 కోట్ల రూపాయలు వలస కార్మికుల కొరకు ఖర్చు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు.  ఈ రోజు వలస కూలీలకు సంబంధించి సీతారామన్ మాట్లాడుతూ.. “సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు రూ.11 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించాం. వలస కార్మికులకు నగదు పంపిణీ చేశాం. వలస కార్మికులకు రోజుకు మూడు పూటలా అన్నపానీయాలు అందించడానికి కృషి చేస్తున్నాం. కొవిడ్‌ సమయంలోనే 7200 నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12 వేల కోట్లు ఇప్పటికే అందించాం. పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించాం’’ అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

 

 

ఈ రోజు ఆత్మనిర్భర్‌ భారత్ ప్యాకేజీ వివరాల్లో భాగంగా వలస కూలీలు, చిన్న రైతులు, స్ట్రీట్ వెండర్స్, ముద్ర యోజన, హౌసింగ్, గిరిజనులకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్యాకేజీ వివరాలను సీతారామన్ వెల్లడిస్తారు.