https://oktelugu.com/

స్పీడెక్కిన తిరుపతి బైపోల్…

తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ స్పీడెక్కింది. ఎన్నికలకు సంబంధించిన పనులను ఈసీ వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి పడింది. ఎందుకంటే.. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలుపొంది అధికార పార్టీ టీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చింది. దుబ్బాక ఫలితం ఏపీ బీజేపీ నేతలపై కూడా ఒత్తడిని పెంచింది. దీంతో ఏపీలోనూ దుబ్బాక ఉప ఎన్నికలకు వచ్చిన ఫలితాన్నే పునరావృతం చేస్తామని […]

Written By: , Updated On : March 23, 2021 / 10:45 AM IST
Follow us on

Tirupati By-Elections 2021
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ స్పీడెక్కింది. ఎన్నికలకు సంబంధించిన పనులను ఈసీ వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి పడింది. ఎందుకంటే.. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలుపొంది అధికార పార్టీ టీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చింది. దుబ్బాక ఫలితం ఏపీ బీజేపీ నేతలపై కూడా ఒత్తడిని పెంచింది. దీంతో ఏపీలోనూ దుబ్బాక ఉప ఎన్నికలకు వచ్చిన ఫలితాన్నే పునరావృతం చేస్తామని ఆ రాష్ర్ట బీజేపీ నేతలు గత కొంతకాలంగా చెబుతూ.. వస్తున్నారు.

Also Read: ఏపీలో ఇసుక దుమారం..

ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన జనసేనను ఒప్పించి తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ పోటీ చేస్తోంది. ఇందుకు బీజేపీ నేతలు చాలా కష్టపడాల్సి వచ్చింది. సుదీర్ఘ మంతనాల తరువాత ఆ సీటు బీజేపీకి దక్కింది. అయితే జనసేన అధినేత సైతం ఈ విషయంలో అధిష్టానం వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అపాయింట్ మెంటు దొరకని పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు విషయలో గుర్రుగా ఉన్నారు. తాను సొంతంగా ముందుకు సాగుతానని తేల్చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి జనసేన మద్దతు కష్టంగానే కనిపిస్తోంది.

Also Read: మోదీతో జగన్ భేటీ.. చంద్రబాబుకు అంత సీనుందా..?

తిరుపతి ఉప ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తుంటారు. 31న పరిశీలన.. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న పోలింగ్.. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మే 4వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఈ నేపథ్యలో అభ్యర్థులు నామినేషన్లపై దృష్టి సారించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఈనెల 24న అంటే బుధవారం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ నామినేషన్ వేయనున్నారు. ఒక బీజేపీ విషయానికి వస్తే.. ఇంకా అభ్యర్థినే ఖరారు చేయని పరిస్థితి కనిపిస్తోంది. అధికార వైఎస్సార్ సీపీ పార్టీ డాక్టర్ గురుమూర్తిని బరిలో దింపేందుకు అంతా సిద్ధం చేసింది. ఈయన ఈనెల 26వ తేదీన నామినేషన్ వేసే అవకాశం ఉంది. డాక్టర్ గురుమూర్తి నామినేషన్ వేసేందుకు మంచి ముహూర్తం కోసం అధికార పార్టీకి చెందిన పెద్దాయన ఒకరు వేద పండితులతో చర్చిస్తున్నారని సమాచారం. ఆ పెద్దాయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాన్ని బట్టి గురుమూర్తి నామినేషన్ వేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రక్రియ రోజురోజుకు ఊపందుకుంటోంది.