https://oktelugu.com/

కంగనాకు అవార్డు.. కారణం అదేనా..?

వివాదాస్పద నటి కంగనా రనౌత్ను జాతీయ ఉత్తమ నటిగా జ్యూరీ ప్రకటించింది. ఒకటికాదు.. రెండు సినిమాల్లో కంగనా నటన జ్యూరీ సభ్యులను మెప్పించింది. అందులో ఒకటి మణి కర్ణిక.. రెండోది పంగా.. రెండు సినామాలు చూసి ఆమెకు కిరీటం పెట్టేశారు. నిజానికి అసలు జాతీయ ఉత్తమ నటిగా అందరూ హాట్ ఫేవరెట్ అనుకుంది మాత్రం దీపికా పదుకొణేని. ఆమె యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోగ్రఫీలో నటించారు. చపాక్ పేరుతో మేఘనా గుల్జార్ తీసిని ఆ సినిమా […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 23, 2021 / 10:40 AM IST
    Follow us on


    వివాదాస్పద నటి కంగనా రనౌత్ను జాతీయ ఉత్తమ నటిగా జ్యూరీ ప్రకటించింది. ఒకటికాదు.. రెండు సినిమాల్లో కంగనా నటన జ్యూరీ సభ్యులను మెప్పించింది. అందులో ఒకటి మణి కర్ణిక.. రెండోది పంగా.. రెండు సినామాలు చూసి ఆమెకు కిరీటం పెట్టేశారు. నిజానికి అసలు జాతీయ ఉత్తమ నటిగా అందరూ హాట్ ఫేవరెట్ అనుకుంది మాత్రం దీపికా పదుకొణేని. ఆమె యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోగ్రఫీలో నటించారు.

    చపాక్ పేరుతో మేఘనా గుల్జార్ తీసిని ఆ సినిమా దేశంలో యాసిడ్ దాడులకు గురయిన వారి బాధను.. ఆవేదనను.. ప్రపంచం ముందు ఉంచింది. పూర్తి డీ గ్లామర్ క్యారెక్టర్లో ఎలాంటి కమర్షియల్ ఫలితాన్ని ఆశించకుండా.. దీపికా పదుకొనే స్వయంగా ఆ సినిమాను నిర్మించి నటించారు. కానీ ఆ సినిమా అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యులను మెప్పించలేదు. అంతే కాదు… అంతకన్నా.. మెరుగైన సినిమాలు కూడా వచ్చాయి. గృహహింస ఆధారంగా తాప్సీ హీరోయిన్ గా నటించిన తప్పడ్.. కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సెనాతో పాటు మరికొన్ని సినిమాల్లో మహిళా క్యారెక్టరుల అద్భుతమైనవని ప్రశంసలు పొందాయి.

    అయితే వారెవ్వరూ… అవార్డుల దరిదాపుల్లోకి రాలేదు. అలా అని కంగనా సినిమాలను తీసి పారేయలేం.. కానీ.. ఆమెకు ఖచ్చితంగా ఆయా సినిమాల్లో నటనతో పాటు .. మరో ప్లస్ పాయింట్ కూడా యాడ్ అయి ఉంటుంది. అదే బీజేపీ కోసం స్టేట్ మెట్లు ఇవ్వడం.. సుషాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత నుంచి కంగనా టోటల్ గా. వివాదాల్లోకి వెళ్లిపోయింది. బీజేపీని ఎవరు వ్యతిరేకిస్తారో… వారిపై విరుచుకుపడడం ప్రారంభించారు. చివరికి రైతు ఉద్యమాన్ని కూడా కించపరుస్తూ.. ఆమె మాట్లాడారు.

    అంతగా సపోర్టు చేసే కళాకారిణికి సుముచిత రీతిలో గౌరవం ఇవ్వాలి అని అనుకోకుండా ఉంటారా…? ఒకవేళ అనుకోకపోయినా.. నిజంగానే కంగనా నటనా ప్రతిభకు ఆ అవార్డు ఇచ్చినా… అంగీకరించడానికి అత్యధికులు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే.. నటనకు మించి ఆయన రాజకీయం చేశారు కాబట్టి…. రాజకీయ కోణంలోనే చూస్తారు. ఇక్కడ దీపికా.. తాప్సీ లాంటివారు బీజేపీకి.. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి.. వారికి సానుభూతి లభిస్తుంది.