ఏపీ తెలంగాణ నీటి ఫైట్: షర్మిల మద్దతు ఎటంటే?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా నీటి కోసం కొట్టుకు చస్తున్నాయి. ఓ వైపు ఏపీ సీఎం జగన్, మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తమ ప్రాంత ప్రయోజనాల కోసం స్నేహాన్ని మరిచి తిట్టిపోసుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ మంత్రులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇంతటి తీవ్ర అలజడుల మధ్య ఏపీ ఆడబిడ్డ.. తెలంగాణ ఇంటికోడలు అయిన వైఎస్ షర్మిల ఎలా స్పందిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉండేది. ఇన్నాళ్లు కేసీఆర్ రగిలించిన ఈ నీటి యుద్ధంపై షర్మిల మౌనంగా ఉంటూ వచ్చింది. […]

Written By: NARESH, Updated On : June 28, 2021 9:42 pm
Follow us on

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా నీటి కోసం కొట్టుకు చస్తున్నాయి. ఓ వైపు ఏపీ సీఎం జగన్, మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తమ ప్రాంత ప్రయోజనాల కోసం స్నేహాన్ని మరిచి తిట్టిపోసుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ మంత్రులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇంతటి తీవ్ర అలజడుల మధ్య ఏపీ ఆడబిడ్డ.. తెలంగాణ ఇంటికోడలు అయిన వైఎస్ షర్మిల ఎలా స్పందిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉండేది. ఇన్నాళ్లు కేసీఆర్ రగిలించిన ఈ నీటి యుద్ధంపై షర్మిల మౌనంగా ఉంటూ వచ్చింది.

ఎందుకంటే అటు చూస్తే కరువుతో అల్లాడే తన సొంత పుట్టిన ప్రాంతం రాయలసీమ.. మరోవైపు తన సొంత అన్నయ్య, ఏపీ సీఎం జగన్ ఆంధ్రా ప్రజల నీటి ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నారు. దీంతో అటు అనలేక.. ఇటు తెలంగాణలో మనుగడ సాగించలేక షర్మిల పడ్డ బాధ అంతా ఇంతా కాదు..

కానీ ఎట్టకేలకు షర్మిల బయటపడ్డారు. ప్రత్యక్షంగా చెప్పకుండా ట్విట్టర్ వేదికగా తన సపోర్టు ఎవరికో తేల్చిచెప్పారు. ‘తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని’ వైఎస్ షర్మిల తన మద్దతు ఇక్కడ రాజకీయం చేస్తుండడంతో తెలంగాణకే అని స్పష్టం చేసినట్టైంది. నీటి కోసం అవసరమైతే ఎవరితోనైనా పోరాడేందుకు తాను సిద్ధమని షర్మిల స్ఫష్టం చేశారు. దీన్ని తోడబుట్టిన జగన్ తోనూ యుద్ధం తప్పదని షర్మిల హింట్ ఇచ్చినట్టైంది.

షర్మిల తెలంగాణ కోసం పోరాడుతున్నా.. తెలంగాణ కోసం నిలబడుతుందా? అని అన్నారని.. కానీ మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నానని.. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టునూ వదులుకునే ప్రసక్తే లేదని.. తెలంగాణ కు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టు ను అయినా తాను అడ్డుకుంటానని.. ఈ ప్రాంత ప్రజల కోసం నిలబడుతానని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ ఏపీ ఆడబిడ్డ రాజకీయంతోపాటు మద్దతు కూడా తెలంగాణకేనని స్పష్టం చేసినట్టైంది.