AP Politics: వైసీపీ 30 మంది ఎమ్మెల్యేలకు సీట్లు కట్టే.. గెలవడం కష్టమేనట?

AP Politics: ఎన్నికల్లో జగనన్న గాలికి అందరు గెలిచారు. వైసీపీ టికెట్ మీద విజయం సాధించినా ప్రజలతో సత్సంబంధాలు ఉండడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజలకు కూడా తెలియడం లేదు. వారి ముఖాలను గుర్తుపట్టడం లేదు. రాజకీయాలంటే తెలియని వారు సైతం రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచినా వారు ప్రజలతో కలిసే సందర్భాలు మాత్రం ఉండడం లేదు. ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రజలు మమ్మల్ని కనీసం గుర్తుపట్టడం లేదని వాపోవడం గమనార్హం. వైసీపీలో […]

Written By: Sekhar Katiki, Updated On : September 14, 2021 11:00 am
Follow us on

AP Politics: ఎన్నికల్లో జగనన్న గాలికి అందరు గెలిచారు. వైసీపీ టికెట్ మీద విజయం సాధించినా ప్రజలతో సత్సంబంధాలు ఉండడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజలకు కూడా తెలియడం లేదు. వారి ముఖాలను గుర్తుపట్టడం లేదు. రాజకీయాలంటే తెలియని వారు సైతం రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచినా వారు ప్రజలతో కలిసే సందర్భాలు మాత్రం ఉండడం లేదు. ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రజలు మమ్మల్ని కనీసం గుర్తుపట్టడం లేదని వాపోవడం గమనార్హం.

వైసీపీలో కూడా కొందరు గెలవడానికి ఆపసోపాలు పడుతున్నారని తెలుస్తోంది. సుమారు 30 మంది వరకు తమ భవితవ్యంపై బెంగ పట్టుకుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారు ఓటమి చెందడం ఖాయమని సమాచారం. దీంతో పార్టీలో భయం పట్టుకుంది. ఎమ్మెల్యేలను ఎలా గట్టెక్కించాలని చూస్తున్నారు. గత ఎన్నికల తరువాత రెండు నెలలు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లో పర్యటించినా తరువాత పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.

ప్రభుత్వ పథకాలన్ని ప్రజల ఖాతాల్లోకి నేరుగా మళ్లించడంతో ప్రజాప్రతినిధులు ప్రజలను కలుసుకునే సందర్భాలు రావడం లేదు. దీంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థ, స్పందన కార్యక్రమాల ద్వారా ప్రజలు నాయకులను మరిచిపోయారు. జనం ప్రజాప్రతినిధులను గుర్తు పట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. అధికార పార్టీయే కాకుండా ఎవరిని కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు.

ఇంతకుముందు ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేసేవారు. అదేవిధంగా ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు రావడంతో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఇదేదో బాగుందని కొందరు తమ సొంత పనుులు చక్కబెట్టుకున్నారని సమాచారం. దీంతో ప్రజల గుర్తింపు లేకపోవడంతో వారు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ప్రచారం సాగుతోంది.

రాష్ర్టం నుంచే కాక కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయాయి. దీంతో ఎంపీలకు కూడా పని ఉండడం లేదు. కరోనా పుణ్యమాని నిధులు నిలిచిపోవడంతో ప్రజాప్రతినిధుల పాత్ర అనుమానాస్పదంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్దు చూపినా నేతలు మాత్రం ఎలా గుర్తు పడతారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్ అంధకారమే అని తెలుస్తోంది.