Junior NTR- TDP: తెలుగుదేశం పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. మునిగిపోయే నావ వలే అయిపోయింది. ఎవరో ఒకరు దాన్ని మునగకుండా కాపాడాల్సిన సమయం వచ్చింది. దానికి సమర్థుడు జూనియర్ ఎన్టీఆర్ అనే వాదన కొద్ది కాలంగా వినిపిస్తోంది. అయితే దీనికి చంద్రబాబు మాత్రం ఓకే అనడం లేదు. ఈ క్రమంలో పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడనుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ నటనకు రెండొంతల మార్కులు పడ్డాయి. ఆయన నటనకు అందరు ఫిదా అయిపోతున్నారు. ఈ సమయంలో ఆయన టీడీపీ కోసం పనిచేస్తే కచ్చితంగా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమే అనే సంకేతాలు వస్తున్నాయి. కానీ దీనిపై అధినేత చంద్రబాబు మాత్రం సానుకూలత వ్యక్తం చేయడం లేదు.

2019 ఎన్నికల్లోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కి ప్రచారం చేయాలని కొందరు వాదించినా చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదు. ఫలితం అధికారానికి దూరం అయ్యారు. దీంతో గతం తాలూకు అనుభవాల దృష్ట్యా ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకుని పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం గ్రహించుకోవాలి. లేదంటే పార్టీ మళ్లీ అధికారం కోల్పోతే ఇక తెలంగాణ పరిస్థితి పునరావృతం కానుందనే బెంగ అందరిలో పట్టుకుంది.
Also Read: Yadadri Temple: నేడే యాదాద్రి ప్రారంభం.. తొలి దర్శనం కేసీఆర్ కే..
ఇక నారా లోకేష్ నాయకత్వంపై పార్టీలోని పెద్దలే పెదవి విరుస్తున్నారు. ఆయనకు అంత సీన్ లేదని తేల్చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే సత్తా ఆయనకు లేదని ఏనాడో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆయనను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడమంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ హిందూపురం బరిలో ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా జత కలిస్తే ఇద్దరు పార్టీని విజయతీరాలకు చేర్చడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా ముందు నుంచే కార్యాచరణ ప్రణాళిక అవసరం. ఎందుకంటే ఓడిపోయిన పార్టీ కావడంతో ముందస్తు వ్యూహాలు ఉండాలి. అధికార పార్టీని ఓడించాలంటే భారీగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. దీని కోసం అహర్నిశలు శ్రమించాలి. తగిన నాయకుడు ఉండాలి. ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టేలా మన ప్రచారం తయారు కావాలి. అందు కోసం పార్టీని ఇప్పటి నుంచే సమాయత్తం చేయాల్సిన అవసరం గుర్తించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి ఉన్న ఒకే ఒక్క అవకాశం జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఆధ్వర్యంలో పార్టీ ముందుకు వెళితే విజయం దక్కడం ఖాయం.

లేదంటే టీడీపీ మరో ఐదేళ్లు అధికారం కోసం ఆగాల్సిందే. వైసీపీ దెబ్బకు కుదేలు కావాల్సిందే. అధికార పార్టీ కావడంతో దానికి ఉన్న బలం వేరే. అధికారం కోల్పోయిన పార్టీ కావడంతో టీడీపీ బలహీనత వేరే. అందుకే చంద్రబాబు స్పందించి టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ ను పిలవక తప్పదని తెలుస్తోంది. ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళితే విజయం సాధించడం కచ్చితమనే వాదన అందరిలోనూ వస్తోంది. ఇక చంద్రబాబుకే తెలుసు ఏం నిర్ణయం తీసుకుంటారో? టీడీపీని ఏం చేస్తారో? వేచి చూడాల్సిందే.
Also Read: Bangaru Telangana: తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?
Recommended Video:
[…] […]
[…] Kapu Community: కాపులు.. నిజంగా ‘కాపు’కాసేవారిగా మిగిలిపోయారు. పల్లకి మోయడం తప్ప..ఆ పల్లకిలో ఎక్కి ఊరేగే అవకాశమొచ్చినా అందిపుచ్చుకోలేని పరిస్థితి కాపులది. సంఖ్యాబలంగా రాష్ట్రంలో కాపులది అగ్రస్థానం. తూర్పుకాపులు, నాయుడులు, తెలగాలు, బలిజలు, ఒంటరి కులస్థులంటూ ప్రాంతాల వారీగా కాపులను ఒక్కోపేరు పెట్టి విభజించారు. అదే కమ్మ సామాజికవర్గమైతే చివరకు చౌదరి, రెడ్డి సామాజికవర్గమైతే చివరకు రెడ్డి అని ప్రత్యేక గుర్తింపును సంతరించుకునేలా సామాజిక‘వర్గ’ప్రయోజనాన్ని కాపాడుకునేలా వారికి వారు తీర్చిదిద్దుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనైనా, విభజిత ఆంధ్రప్రదేశ్ లోనైనా జనాభాలో సింహభాగం కాపులదే. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలైతే ఉన్నాయి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత పాత‘కాపు’లను పక్కన పడేస్తున్నారు. రాజకీయ పార్టీల వారీగా కాపు నాయకులు విడిపోతున్నారు. వర్గ ప్రయోజనాలను పక్కన పెట్టి నేతలు బాగుపడుతున్నారు. కానీ సామాజికవర్గంలో వెనుకబాటును రూపుమాపలేకపోతున్నారు. జాతి కోసం ఐక్యత చాటుకోలేకపోతున్నారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం రూపంలో రాజ్యాధికారానికి అవకాశం వచ్చినా కాపులు జారవిడిచుకున్నారు. […]
[…] […]
[…] […]
[…] […]
[…] AP Politics Communist Party: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పొత్తులపై కూడా ఎత్తులు వేస్తున్నారు. అధికారం కోసం ఏ పార్టీతో అయినా కలిసేందుకు కొన్ని పార్టీలు చూస్తుంటే తమకు నచ్చిన పార్టీతోనే నడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో పెనుమార్పులు జరిగే అవకాశాలున్నాయి. అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనే క్రమంలో పొత్తుల వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కే వీలుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ లో మరిన్ని మార్పులు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి. […]
[…] Telugu Desam Party: ఆ పార్టీ ఆవిర్భావమే దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఆవిష్కరణం. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ఓ ప్రభంజనం. ఢిల్లీ పీఠాలను కదిలించినా, సొంత పార్టీలో సంక్షోభాలు ఎదుర్కొన్నా నాలుగు దశాబ్దాల పాటు పడిలేస్తూ.. లేచిపడుతూ నిలబడింది తెలుగుదేశం పార్టీ. 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారకరామారావు చేతిలో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ఇంతింతై వటుటింతై అన్న చందంగా ఎదిగింది. ఢిల్లీ తంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలను తట్టుకొని నిలిచింది. 40 వసంతలు పూర్తి చేసుకుంది. తెలుగు వారి జీవితాలపై చెరగని ముద్ర వేసుకుంది. జాతీయ పార్టీలు తప్ప ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించలేని ప్రస్తుత తరుణంలో నాలుగు దశాబ్దాల పాటు తన ఉనికిని చాటుకుంటోంది. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో నలిగిపోయిన రాష్ట్రాన్ని చూసి ఎన్టీఆర్ చలించిపోయారు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని ఢిల్లీ నాయకులకు తాకట్టు పెట్టడాన్ని సహించలేకపోయారు. అందుకే సమర భేరీ మొగించారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పిలస్తోంది..రా.. కదలి రా అంటూ నినదించి తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతోనే ఎంతోమంది విద్యాధికులు తమ చేయిని కలిపారు. బడుగు బలహీన వర్గాల వారు చేరువయ్యారు. సామాన్యులు సైతం ఎన్టీఆర్ తో అడుగులు వేశారు. దాని ఫలితమే అక్కడు తొమ్మిది నెలల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. దేశ రాజకీయ యవనికపై కొత్త అధ్యయనాన్ని స్రుష్టించింది. ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. కిలో రెండు రూపాయలకు బియ్యం అందించడం, పట్వారి వ్యవస్థ రద్దు, గ్రుహ నిర్మాణం వంటి వాటితో ఎన్టీఆర్ జనరంజకమైన పాలన అందించారు. అప్పటివరకూ కప్పం కట్టడమే తప్ప సంక్షేమం అన్న మాట ఎరుగని తెలుగు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారు. […]
[…] […]