spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: హ‌త్యారోప‌ణ‌ల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజ‌కీయాలు..!

AP Politics: హ‌త్యారోప‌ణ‌ల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజ‌కీయాలు..!

AP Politics:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలు రోజురోజుకూ జుగుప్సాకరమైన విధంగా మారుతున్నాయి. జ‌గ‌న్ పాల‌న మొదలైయి రెండున్న‌రేండ్లు గ‌డ‌వ‌గానే అప్పుడే రంజుగా సాగుతున్నాయి. ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో వేడెక్కుతున్నాయి. ఇక మొన్న అసెంబ్లీ ఘ‌ట‌న త‌ర్వాత దేశ రాజ‌కీయాల్లోనూ హాట్ టాపిక్ అయ్యాయి ఏపీ రాజ‌కీయాలు. ఇది మ‌రువ‌క ముందే ఇప్పుడు వైసీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. జ‌గ‌న్‌ను మ‌ర్డ‌ర్ చేసి అయ‌నా సీఎం కావాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నార‌ని ఇద్ద‌రు వైసీపీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.

AP Politics
AP Politics

ఒక‌వైపు చంద్ర‌బాబు సెంటిమెంట్ రాజ‌కీయాల‌ను పండించే ప‌నిలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌భ‌లు పెట్టి త‌న‌కు జ‌రిగిన అవ‌మానం గురించి చెప్పాలనుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఎక్క‌డ చంద్ర‌బాబుకు సింపతీ పెరిగిపోతుంద‌నే భ‌యంతోనే వైసీపీ ఇలాంటి లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని వాపోతున్నారు తెలుగు త‌మ్ముళ్లు. కానీ రాప్తాడు ఎమ్మెల్యే ప్ర‌కాశ్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి ఈ ఆరోప‌ణ‌ల చేశారు. అయితే వీరిద్ద‌రూ వారంత‌ట వారే చేశార‌నే ఆరోప‌ణ‌ల‌కు ఆస్కారం లేదు.

ఎందుకంటే ఇలాంటి పెద్ద ఆరోప‌ణ‌లు చేయాలంటే క‌చ్చింత‌గా పార్టీ పెద్ద‌ల నుంచే ఆ ఆలోచ‌న పుట్టాల‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. అంటే ఈ ఆరోప‌ణ‌లు అన్నీ వ్యూహాత్మ‌కంగానే జ‌రుగుతున్నాయ‌నే అనుమానాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇక వీరి ఆరోప‌ణ‌ల‌కు టీడీపీ త‌మ్ముళ్లు, నేత‌లు గ‌ట్టిగానే కౌంట‌ర్ వేస్తున్నారు. గ‌తంలో చేసిన‌ట్టే కోడిక‌త్తి, లేదంటే గొడ్డలిపోటు లాంటివి ఏవో తామంత‌ట తామే ప్లాన్ చేసుకుంటున్నారని ఇది వారికి బాగా అల‌వాటు అయిపోయందంటూ ఆరోపిస్తున్నారు టీడీపీ నేత‌లు.

Also Read: Padayatra: తుది అంకానికి చేరుకున్న ‘మహాపాదయాత్ర’.. ఉత్కంఠ?

ఇక్క‌డే టీడీపీ నేత‌లు ఇంకో ప్ర‌శ్న కూడా సంధిస్తున్నారు. అదేంటంటే.. చంద్ర‌బాబుకు అలాంటి ఆలోచ‌న ఉంటే.. ఆయ‌న అధికారంలో ఉన్న ఐదేండ్లు జ‌గ‌న్ అంత ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా తిరగారంటూ అడుగుతున్నారు. ఇలా వైసీపీ ఆరోప‌ణ‌ల‌కు టీడీపీ కౌంట‌ర్లు న‌డుస్తున్నాయి. అయితే ఈ ఆరోప‌ణ‌లు కాస్తా సాధార‌ణ రాజ‌కీయాల నుంచి హ‌త్యా రాజ‌కీయాల వైపు దారి తీస్తున్నాయంటూ చెబుతున్నారు విశ్లేష‌కులు.

Also Read: ABN Radhakrishna: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను జగన్ బుక్ చేసినట్టేనా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper
Exit mobile version