https://oktelugu.com/

Rashmika: ఈ సినిమా కోసం మా అమ్మానాన్నలకు దూరంగా ఉండాల్సి వచ్చింది- రష్మిక

Rashmika: చలో సినిమాతో  తెలుగు ప్రేక్షకులను పలకరించి.. అతి తక్కువ సమయంలోనే నేషనల్​ క్రష్​గా మారిన హీరోయిన్​ రష్మిక. కొంత మంది లక్కీ బ్యూటీ అని కూడా అంటారు.  ఛలో సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి వరుసగా  అవకాశాలు క్యూకట్టాయి. అప్పటినుంచే తెలుగు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. విజయ్​ దేవరకొండ నటించిన గీతాగోవందం, డియర్ కామ్రెండ్​ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుని.. ఆతర్వాత స్టార్ హీరోలతో జతకట్టింది. మహేశ్​బాబు నటింటిన సరిలేరు నీకెవ్వరు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 02:41 PM IST
    Follow us on

    Rashmika: చలో సినిమాతో  తెలుగు ప్రేక్షకులను పలకరించి.. అతి తక్కువ సమయంలోనే నేషనల్​ క్రష్​గా మారిన హీరోయిన్​ రష్మిక. కొంత మంది లక్కీ బ్యూటీ అని కూడా అంటారు.  ఛలో సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి వరుసగా  అవకాశాలు క్యూకట్టాయి. అప్పటినుంచే తెలుగు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. విజయ్​ దేవరకొండ నటించిన గీతాగోవందం, డియర్ కామ్రెండ్​ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుని.. ఆతర్వాత స్టార్ హీరోలతో జతకట్టింది.

    మహేశ్​బాబు నటింటిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్​గా కనిపించిన రష్మిక.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్పలో నటిస్తోంది. ఇందులో బన్నీకి జోడీగా కనిపించనుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్​గా కనిపించనుండగా.. రష్మిక పల్లెటూరి యువతిగా డీగ్లామర్​ లుక్​లో దర్శనమివ్వనుంది. ఈ సినిమా డిసెంబరు 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్​లో ప్రీ రిలీజ్​ ఈవెంట్​ నిర్వహించింది చిత్రబృందం.

    ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. స్పీచ్ మొదలుపెట్టింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. ఈవెంట్​కు వచ్చిన కొంతమందికి గాయాలయ్యాయని తెలిసి బాధేసిందని పేర్కొంది. అనంతరం.. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారని.. ఆ కష్టానికి తగ్గ ఫలితమే పుష్ప అని పేర్కొంది. ఈ సినిమా కోసం తన తల్లిదండ్రులకు కూడా చాలా దూరంగా ఉండాల్సి వచ్చిందని పేర్కొంది రష్మిక. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమౌళి, కొరటాల శివ, మారుతి హాజరయ్యారు.