Rajanikanth: సింపుల్​గా రజనీ పుట్టినరోజు వేడుకలు.. నెట్టింట్లో ఫొటోలు వైరల్​

Rajanikanth: సూపర్​స్టార్​ రజనీకాంత్​ నిన్న డిసెంబరు 12న పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్​మీడియా వేదికగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కొంత మంది అభిమానులు రజనీ ఇంటి ముందుకు వచ్చి పండగ వాతావరణం నెలకొల్పారు. రజనీకాంత్​కు దీంతో 70 వసంతాలు పూర్తిచేసుకుని. 71లోకి అడుగుపెట్టారు. కాగా, ఆయన తన పుట్టినరోజు వేడుకలను చాలా సింపుల్​గా జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కూతురు, మనవళ్ల మధ్య జరిగిన ఈ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 13, 2021 2:28 pm
Follow us on

Rajanikanth: సూపర్​స్టార్​ రజనీకాంత్​ నిన్న డిసెంబరు 12న పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్​మీడియా వేదికగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కొంత మంది అభిమానులు రజనీ ఇంటి ముందుకు వచ్చి పండగ వాతావరణం నెలకొల్పారు. రజనీకాంత్​కు దీంతో 70 వసంతాలు పూర్తిచేసుకుని. 71లోకి అడుగుపెట్టారు. కాగా, ఆయన తన పుట్టినరోజు వేడుకలను చాలా సింపుల్​గా జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కూతురు, మనవళ్ల మధ్య జరిగిన ఈ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తతం నెట్టింట వైరల్​గా మారారియ కాగా, ఈ ఫొటోల్లో రజనీకాంత్​ ఎప్పటిలాగే చాలా సాదాసీదా పంచె, షర్ట్​తో కనిపించారు.

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్​గా మారాయి. కాగా, రజనీ తనను నటించే ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్​ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు కొన్ని వందల కోట్ల ఆస్తి ఉంది. అయితే, ఆయన సంపాదించే వాటిలో చాలా వరకు దాన ధర్మాలకే అంకితం చేస్తుంచారు తలైవా. ఒక్కోసారి తన సినిమా ఫ్లాప్​ అయితే.. నిర్మాత నష్టపోకూడదని తన రెమ్యునరేష్​ కూడా వదులుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇటీవలే అన్నాత్తై సినిమాతో వచ్చిన రజనీ.. మంచి హిట్​ అందుకున్నారు. రోబో తర్వాత పెద్దగా హిట్​ కొట్టలేని రజనీ.. పేటా, దర్బార్​తో సరికొత్త ట్రెండ్​ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.