YCP: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ దూకుడు మీదుంది. ఏ ఎన్నికలు వచ్చినా క్లీన్ స్వీప్ చేయడమే. దీంతో ప్రత్యర్థి పార్టీలు గెలుపు ముంగిట బోర్లా పడుతున్నాయి. ఇటీవల వెలువడిన స్థానిక సంస్థల ఫలితాల్లో కూడా వైసీపీ ప్రభంజనమే సృష్టించింది. అన్ని స్థానాలు కైవసం చేసుకుని తనకు ఎదురు లేదని నిరూపించింది. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగే 14 ఎమ్మెల్సీ స్తానాల ఎన్నికల్లో కూడా తన సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. అన్ని స్థానాలు వైసీపీ గెలుచుకోవడంతో ఇక అన్ని ఎమ్మెల్సీ స్థానాలు సైతం వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి.

కరోనా కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వచ్చే నెలలో నిర్వహించనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కోర్టు పరిధిలో ఉన్నందున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు తిరుగులేని పార్టీ కావడంతో వైసీపీ తన ప్రభావం చూపించే వీలుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు వైసీపీదే అని తెలుస్తోంది.
దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుతుందని అందరికి తెలిసిందే. దాదాపు అన్ని స్థానాలు దక్కించుకుంటుంది. ఈ మేరకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. దీంతో అధినేత ఎవరికి స్థానం కల్పిస్తారోనని ఎదురు చూస్తున్నారు. తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జాబితాలో తమ పేరు ఉండాలని తాపత్రయ పడుతున్నారు.
Also Read: Pawan kalyan: పవన్ భారీ విరాళం వెనుక ‘దళిత ఓటు బ్యాంక్’ కథ!
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అభ్యర్థుల ప్రకటనకు దాదాపు కసరత్తు పూర్తయిపోయింది. ఎవరెవరిని నియమించాలనే దానిపై జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మండలిలో ఇప్పటికే వైసీపీకి మెజార్టీ ఉండగా వీరితో ఎదురు లేకుండా పోతుంది. ఏ చట్టం కావాలన్నా వేరే పార్టీపై ఆధారపడకుండా స్వతంత్రంగా చట్టం తీసుకువచ్చే వీలుంటుంది.