Sajjala Ramakrishna Reddy- Vijayasai Reddy: ఆ ఇద్దరితోనే వైసీపీకి కొత్త తలనొప్పులు.. సజ్జల, విజయసాయిరెడ్డిలపై నేతల ఆగ్రహం

Sajjala Ramakrishna Reddy- Vijayasai Reddy: ఆ ఇద్దరూ పార్టీ పతనాన్ని కోరుకుంటున్నారా? అధినేతకు తప్పుడు సలహాలు ఇస్తున్నారా? పార్టీలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారా?.. వైసీపీ నేతల్లో ఇప్పుడు ఇదో కొత్త చర్చ ప్రారంభమయ్యింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామక్రిష్టారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఇప్పుడు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మంత్రివర్గ కూర్పు పర్యవసానాలతో వీరి పాత్ర ఉన్నట్టు అసంతుష్టులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణలో వైసీపీలో పెల్లుబికిన ఆగ్రహవేశాలు ఎవరూ ఊహించలేదు. చాలామంది మంత్రి పదవులు […]

Written By: Admin, Updated On : April 16, 2022 10:48 am
Follow us on

Sajjala Ramakrishna Reddy- Vijayasai Reddy: ఆ ఇద్దరూ పార్టీ పతనాన్ని కోరుకుంటున్నారా? అధినేతకు తప్పుడు సలహాలు ఇస్తున్నారా? పార్టీలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారా?.. వైసీపీ నేతల్లో ఇప్పుడు ఇదో కొత్త చర్చ ప్రారంభమయ్యింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామక్రిష్టారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఇప్పుడు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మంత్రివర్గ కూర్పు పర్యవసానాలతో వీరి పాత్ర ఉన్నట్టు అసంతుష్టులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణలో వైసీపీలో పెల్లుబికిన ఆగ్రహవేశాలు ఎవరూ ఊహించలేదు. చాలామంది మంత్రి పదవులు ఆశించారు.

Sajjala Ramakrishna Reddy- Vijayasai Reddy

అందుకు తగ్గట్టు ఆశలు పెట్టారు కూడా. కలిసిన ఎమ్మెల్యేలందరికీ మాట ఇచ్చేశారు మీ ప్రమాణస్వీకారమే తరువాయి అన్నట్టు భుజం తట్టి పంపారు. పార్టీ అధినేత ఒకరికి, సజ్జల మరొకరికి, విజయసాయిరెడ్డి ఇంకొకరికి అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తమకు మంత్రి పదవి ఖాయమని ఆశావహులు తెగ సంబరపడిపోయారు. చివరకు మొండిచేయి చూపేసరికి అలకపాన్ను ఎక్కారు. కన్నీటిపర్యంతమయ్యారు. అక్కడితో ఆగకుండా అనచరులు నిరసన పర్వం కొనసాగించారు. అటు సీఎం వైపు నుంచి బుజ్జగింపులు. ఇటు అసంతుష్టుల నుంచి హెచ్చరికలు సైతం కొనసాగాయి. నాలుగు రోజుల తరువాత పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతానికైతే టీ కప్పులో తుపాను అని భావిస్తున్నారు అంతా. కానీ దీని పర్యవసానం మున్ముంద ప్రకంపలు స్రుష్టించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Jagan Plan B: జగన్ ప్లాన్ ‘బీ’ రెడీ.. ‘మాజీ’లకు కూడా పదవులు..!

అసంతుష్టుల నిందలు వారిపైనే..
మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు ఎవరూ అధినేత జగన్ కు వ్యతిరేకంగా మాట్టాడలేదు. కోటరీనే తూలనాడారు. వారి చర్యలనే తప్పుపట్టారు. మొన్న జరిగిన ఎపిసోడ్ లో అసంతుష్టుల నుంచి వినిపిస్తున్న మాట సజ్జల రామక్రిష్ణా రెడ్డి. ఆయన వల్లే తమకు పదవి రాలేదని ఆరోపిస్తున్నారు. అసలు ఆయన ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి ఎన్నికైన తాము కాదని.. సలహాదారు కుర్చీలో కూర్చొన్న ఆయనకు ఎందుకంత ప్రాధాన్యం అని అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనే అంతా చేస్తున్నారని మండి పడుతున్నారు. పదవి కోల్పోయిన సుచరిత ఇంటిదగ్గర బహిరంగంగా సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి . అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ఈ సజ్జల ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సజ్జల జోక్యం మితి మీరిపోతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపిస్తోంది. ఏ విషయం ఆయనకు సంప్రదించాల్సి రావడం సీనియర్లకు సైతం మింగుడు పడడం లేదు. సీఎంవోను కూడా సజ్జల గుప్పిట్లో పెట్టుకున్నారని అన్నీ అక్కడ్నుంచి ఆయనే నడిపిస్తున్నారన్న అసంతృప్తి వైసీపీలో ప్రారంభమైంది. జగన్‌కు పార్టీ నేతలు, క్యాడర్‌కు మధ్య అడ్డుగోడలా సజ్జల ఉండి గ్యాప్ పెంచుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రిని కలవాలన్నా మధ్యలో సజ్జల అడ్డుపడుతుండడంపై పార్టీ నేతల్లో ఓకింత అసంత్రుప్తి వ్యక్తమవుతోంది. అపాయిట్మెంట్లు కూడా ఆయనే డిసైడ్ చేస్తుండడం పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది.

Sajjala Ramakrishna Reddy- Vijayasai Reddy

ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహార శైలి కూడా పార్టీ సీనియర్లకు రుచించడం లేదు. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర బాధ్యుడిగా ఉన్నారు. పార్టీలో చేరికల నుంచి నామినేటెడ్ పదవుల పందేరం వరకూ అంతా ఆయనే చూసుకుంటున్నారు. గత ఏడాది ప్రభుత్వం వివిధ కార్పోరేషన్ల కు పాలకవర్గాల నియామకం విషయంలో స్థానిక ఎమ్మెల్యేలకు సైతం సమాచారమివ్వలేదు. తుది జాబితా ప్రకటన సమయంలో కూడా తెలియనివ్వలేదు. దీంతో మీ నియోజకవర్గం నుంచి పలాన నేతకు, పలానా పదవి వచ్చిందంటూ అంతర్గత సమావేశాల్లో చెప్పగా ఖంగుతినడం వారి వంతైంది. ఇదంతా విజయసాయిరెడ్డి పుణ్యమేనంటూ ఉత్తరాంధ్ర నేతలు తెగ బాధపడుతున్నారు. విశాఖ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేల విషయమైతే ఛెప్పనవసరం లేదు. అంతా బొమ్మరిల్లు ఫాదర్ గా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని అక్కడి ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే విశాఖ జిల్లాకు మంత్రి పదవి లేకుండా చేశారని.. అన్నీ తానే చక్కబెట్టవచ్చన్న భావనతోనే విజయసాయిరెడ్డి పావులు కదిపారని ఆరోపిస్తున్నారు.

Also Read:Kodali Nani- Perni Nani- Anil Kumar Yadav: స్వామిభక్తి కాపాడలేకపోయింది.. నాని ధ్వయం..అనిల్ కుమార్ యాదవ్ లు చేసిన తప్పేమిటి?

Tags