Homeఎంటర్టైన్మెంట్Pooja Hegde: ఐటెం సాంగ్ కోసం భారీగా తీసుకుంటున్న పూజా.. అమ్మ‌డి రేంజ్ వేరే..

Pooja Hegde: ఐటెం సాంగ్ కోసం భారీగా తీసుకుంటున్న పూజా.. అమ్మ‌డి రేంజ్ వేరే..

Pooja Hegde: ఇప్పుడు సౌత్ టు నార్త్ వర‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే. వ‌రుస పెట్టి పెద్ద ప్రాజెక్టుల‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. పైగా ఆమె స్టార్ హీరోల స‌ర‌స‌న మాత్ర‌మే న‌టిస్తోంది. ఈ భాష‌, ఆ భాష అనే తేడా లేకుండా కుమ్మేస్తోంది. ఏదైనా పెద్ద సినిమా వ‌స్తోందంటే అందులో పూజానే మొద‌టి ఛాన్స్ గా మారిపోతోంది. ఆ రేంజ్‌లో ఛాన్సులు ప‌ట్టేస్తోంది. పైగా ల‌క్కీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది.

Pooja Hegde
Pooja Hegde

మొన్న బీస్ట్ మూవీ ప్రెస్ మీట్ లో దిల్ రాజ్ స్వ‌యంగా ఆమెను ల‌క్కీ హీరోయిన్ అంటూ.. పూజా మ‌న కాజా అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. దాన్ని బ‌ట్టి చెప్పొచ్చు.. ఆమె ఏ రేంజ్‌లో బిజీగా సినిమాలు చేస్తుందో. అయితే ఈ మ‌ధ్య వ‌చ్చిన రెండు పెద్ద సినిమాలు మాత్రం అట్ట‌ర్ ప్లాప్ అయ్యాయి. ఇందులో రాధేశ్యామ్ ఒక‌టి అయితే.. రెండోది విజ‌య్ బీస్ట్ మూవీ. ఈ రెండు గ‌న‌క హిట్ అయితే.. పూజా రేంజ్ మ‌రోలా ఉండేద‌నే చెప్పుకోవాలి.

Also Read: Big Boss Telugu OTT Contestent Anchor Sravanthi: బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసిన యాంక‌ర్ స్ర‌వంతి.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డి..

కానీ ఆ ప‌లితాలు పూజా కెరీర్‌పై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించ‌ట్లేదు. ఎందుకంటే ఆమెకు ఇప్ప‌టికే చేతినిండా సినిమాలు ఉన్నాయి. పైగా కొత్త సినిమాలు కూడా చాలానే ఆఫ‌ర్లు వ‌స్తున్నాయంట‌. డేట్స్ లేవ‌ని అమ్మ‌డు వాటిని దూరం పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా బీస్ట్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో.. పూజా డేట్స్ ఇస్తావా అంటూ దిల్ రాజు స్వ‌యంగా అడిగిన విష‌యం చూశాం. ఆ డేట్స్ దేనికోస‌మే ఇప్పుడు తెలిసింది.

Pooja Hegde
Pooja Hegde

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్‌, వెంక‌టేశ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా ఎఫ్‌-3. ఇందులో ఐట‌మ్ సాంగ్ కోసం పూజాను దిల్ రాజు అడ‌గ్గా.. ఓకే చెప్పేసిందంట‌. కానీ భారీ రెమ్యున‌రేష‌న్ అడిగిన‌ట్టు తెలుస్తోంది. మూడు రోజులు జ‌రిగే సాంగ్ షూటింగ్ కు ఆమె ఏకంగా.. రూ.1.25 పారితోషికం తీసుకున్న‌ట్టు స‌మాచారం. అయితే ఆమె రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఒక సినిమాకు తీసుకునేంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చారంటూ చ‌ర్చ సాగుతోంది. అయితే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజా.. ఇలాంటి సాంగ్స్ ల‌లో న‌టించ‌బోన‌ని చెప్పిందట‌. కానీ దిల్ రాజు అడిగే స‌రికి కాద‌న‌లేక‌.. భారీ రెమ్యున‌రేష‌న్‌కు ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. ఎంతైనా బుట్టబొమ్మ రేంజ్ వేరంటున్నారు ఆమె ఫ్యాన్స్‌.

Also Read:Krishnabhagavan: ఆ కమెడియన్ నన్ను ఇండస్ట్రీలో తొక్కేశాడు.. క్యాష్ షోలో గుట్టువిప్పిన కృష్ణ భగవాన్!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version