Kapu Community : రెడ్డిలు, కమ్మలకు వేలకోట్లు.. కాపులకు పిసిరంత? జగన్ కు కాపులు అవసరం లేదా?

Kapu Community: తెలుగు రాజకీయాలంటే ఎప్పుడూ కమ్మ, రెడ్లు యేనా? ప్రబలంగా ఉన్న ‘కాపు’లకు ఎందుకు సరిసమానంగా నిధులు దక్కడం లేదు.? ఎప్పుడూ అగ్ర వర్ణాల కింద పదవుల్లోనే కాదు.. నిధుల పంపిణీలోనూ అన్యాయమేనా? ఏపీలో రాజకీయాలను శాసించేలా ప్రబలంగా ఉన్న ‘కాపు సామాజికవర్గం’.. నిధులు సాధించుకోవడంలో ఎందుకు విఫలమవుతోంది. ? పాలకులు ఎందుకు కాపులపై సీతకన్ను వేస్తున్నారు. మైనార్టీలుగా ఉన్న రెడ్డి, కమ్మ వారికి వేల కోట్లు ఇచ్చి.. ఏపీలో మెజార్టీ జనాభా ఉన్న కాపులకు […]

Written By: NARESH, Updated On : March 12, 2022 3:41 pm
Follow us on

Kapu Community: తెలుగు రాజకీయాలంటే ఎప్పుడూ కమ్మ, రెడ్లు యేనా? ప్రబలంగా ఉన్న ‘కాపు’లకు ఎందుకు సరిసమానంగా నిధులు దక్కడం లేదు.? ఎప్పుడూ అగ్ర వర్ణాల కింద పదవుల్లోనే కాదు.. నిధుల పంపిణీలోనూ అన్యాయమేనా? ఏపీలో రాజకీయాలను శాసించేలా ప్రబలంగా ఉన్న ‘కాపు సామాజికవర్గం’.. నిధులు సాధించుకోవడంలో ఎందుకు విఫలమవుతోంది. ? పాలకులు ఎందుకు కాపులపై సీతకన్ను వేస్తున్నారు. మైనార్టీలుగా ఉన్న రెడ్డి, కమ్మ వారికి వేల కోట్లు ఇచ్చి.. ఏపీలో మెజార్టీ జనాభా ఉన్న కాపులకు ఎందుకు వందలకే పరిమితం చేస్తున్నారన్న ప్రశ్న అందరినీ తొలుస్తోంది. తాజాగా ఏపీ బడ్జెట్ కేటాయింపులలోనూ ‘కాపులకు’ అన్యాయమే జరిగింది. ఈ ఆవేదన ఇప్పుడు కాపుల్లో అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమవుతోంది.

Jagan

ఏపీ రాజకీయం అంతా కమ్మ, రెడ్డిల చుట్టే తిరుగుతోంది. సరే రాజ్యాధికారం వారిదే.. కాపులు వారి కింద ద్వితీయ శ్రేణి పదవుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. కానీ మెజార్టీ కాపులకు కనీసం బడ్జెట్ లో అయినా న్యాయం చేయాలి కదా? ఏపీ జనాభాలో తక్కువగా ఉన్న రెడ్డీ, కమ్మలకు వేల కోట్లు దోచిపెట్టి.. మెజార్టీ ఉన్న కాపులకు పిసిరంత కేటాయించడం ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.

ఏపీలోని కాపులు తమకు అధికారం కావాలని దశాబ్ధాలుగా కోరుకుంటున్నారు. కానీ అది ఎప్పటికీ నెరవేరని కలగానే మిగిలిపోతోంది.. సూదూర భవిష్యత్తులోనూ కాపులు అధికారంలోకి వచ్చే సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఇప్పటికే ప్రజారాజ్యంతో ‘చిరంజీవి’ ముందుకొచ్చిన నాటి రెడ్డి, కమ్మల రాజకీయ చదరంగంలో ఆయన పార్టీని మూసివేసి రాజకీయాల నుంచే వైదొలిగారు. చిరంజీవికి లేని మరకలు అంటించి ఆయనను సాగనంపారని.. దీని వెనుక కుట్రలు కుతంత్రాలు సాగాయని అప్పటి నుంచే ఉంది.

Also Read: AP Budget 2022-23: ఏపీ ఆర్థిక బ‌డ్జెట్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే..?

ఇప్పటికీ కాపుల తరుఫున జనసేనాని పవన్ కళ్యాణ్ బలంగా నిలబడుతున్నా.. ఆయనపై వైసీపీ బ్యాచ్ బూతులతో విరుచుకుపడుతూ..తెరవెనుక పవన్ మానసిక స్థైర్యం దెబ్బతినేలా ఎన్నో కుట్రలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అయినా పవన్ మొండి పట్టుదలతో ఈ కుట్రలను చేధిస్తూ ముందుకెళుతున్నారు. కమ్మ, రెడ్డి రాజకీయ లాబీని బలంగా ఎదుర్కొంటున్నారు. ఎన్ని అవమానాలు, రాజకీయ దెబ్బలు ఎదురైనా కూడా చేధిస్తూ ముందుకెళుతున్నారు.

ఈ పరిణామాల వెనుక ప్రధాన కారణం ఏంటంటే.. కాపు నేతలు రాజకీయంగా ఎదుగకూడదన్న కసి రెడ్డి, కమ్మ వర్గాల్లో బలంగా ఉంది. కాపు నేతలు ఎదిగితే.. ఆ తర్వాత కాపు రిజర్వేషన్లు, వాళ్లకు నిధులు, వాళ్ల కోరికలు తీర్చడం ఇష్టం లేక అనాధిగా ఆ వర్గాన్ని తొక్కేస్తున్నారన్న విమర్శలున్నాయి. పైగా ఆంధ్రాలో రాజకీయాలు కేవలం రెండే రెండు సామాజికవర్గాలు శాసిస్తున్నాయి. దశాబ్ధాలుగా ఇదే జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఆది నుంచి రెడ్లు ఏపీని ఏలారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వచ్చాక కమ్మ సామాజికవర్గం దూసుకొచ్చింది. అయితే ఏపీలో మెజార్టీ సంఖ్యలో ఉన్న కాపులు ఎప్పుడూ పల్లకీ మోయడమేనా? అధికారంలోకి రాకుండా ఎప్పటి నుంచో తొక్కేస్తున్నారు. అందులో ప్రశ్నించే వాళ్లే లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు నిధుల కేటాయింపుల లోనూ అదే వివక్ష.. ఏపీ బడ్జెట్ కేటాయింపుల్లో తక్కువ జనాభా ఉన్న కమ్మ, రెడ్డకు వేల కోట్లు ఇచ్చి.. ఏపీ జనాభాలో 20 శాతానికి పైగా ఉన్న కాపుల మాత్రం కేవలం 500 కోట్లు కేటాయించడం చాలా అన్యాయం అని ఆ సామాజికవర్గం ప్రజలు, నేతలు వాపోతున్నారు.

తాజాగా ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో కాపు నేస్తానికి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అదే సమయంలో కమ్మ సంక్షేమానికి 1899 కోట్లు కేటాయించారు. ఇక అధికారంలో ఉన్న సీఎం జగన్ సామాజికవర్గమైన రెడ్డి సంక్షేమానికి 3088 కోట్లు భారీగా నిధులు కేటాయించారు. క్రిస్టియన్ కార్పొరేషన్ కు 113 కోట్లు కేటాయింపులు చేశారు. ఏపీలో అత్యల్పంగా ఉండే వైశ్య సంక్షేమం కోసం కూడా ఏకంగా 915 కోట్లు కేటాయించారు. కాపుల్లో 1 శాతం కూడా లేని వైశ్యులకు 915 కోట్లు. మెజార్టీ కాపులకు 500 కోట్లు కేటాయించడం ఏంటని ఆ వర్గం వారు మండిపడుతున్నారు.

ఏపీలో మెజార్టీ ప్రజలకు తక్కువ.. మైనార్టీ ప్రజలకు ఎక్కువ కేటాయింపులు చేసిన వైసీపీ సర్కార్ తీరుపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ పై కోపం ఉంటే ఆయనపై చూసుకోవాలని.. ఆయన సామాజికవర్గం అయిన కాపులపై ఈ పగ చూపారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చూసుకున్నా అన్ని వర్గాల కంటే ఎక్కువ నిధులు కేటాయించాలి. కానీ కాపులపై ఈ వివక్షకు కారణం ఏంటని ఆ వర్గం వారు నినదిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు ఈ వివక్షను వీడాలని.. ఈ సవతి తల్లి ప్రేమను చూపొద్దని కాపులంతా కోరుతున్నారు.

Also Read: Janasena : జనసేన సైన్యంలోకి మరికొందరు..