China Imposes Lockdown: చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచానికి పాకి ఎంతటి వినాశనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రజల ప్రాణాలను పిట్టల్లా రాల్చింది. చైనాలోని వూహాన్ నుంచి ఈ వైరస్ ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరి కోట్ల మంది ప్రాణాలు బలితీసుకుంది. 2020 సంవత్సరంలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ఇప్పటికీ మన మధ్యనే ఉంది.
రెండేళ్లుగా ప్రపంచం ఈ వైరస్ తో పోరాడుతోంది. యూరప్ , అమెరికాలో అయితే మరణ మృదంగం వినిపించింది. ఇక వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి అయ్యి అందరూ రెండు డోసులు తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడుతోంది. భారత్, అమెరికా, యూరప్ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విమానాలు మళ్లీ పునరుద్ధరణ అవుతున్నాయి. క్రీడలు ప్రారంభమయ్యాయి. ప్రపంచం అంతా ఊపిరిపీల్చుకుంటున్న వేళ చైనాలో మళ్లీ కొత్త పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
కరోనాతో ప్రపంచమంతా ఊరట చెందుతున్న సమయంలో ఈ వైరస్ పుట్టినింట మరోసారి కరోనా విజృంభించడం ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనాను కంట్రోల్ చేసి ప్రపంచానికి వదిలిన చైనాను మరోసారి ఈ వైరస్ భయపెడుతోంది. చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో అక్కడ లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి నెలకొంది.
Also Read: Akhil Agent Release Date: ఆగస్టు 12న రానున్న ఏజెంట్.. అఖిల్ కోరిక తీరుస్తాడా ?
చైనాలోని ఈశాన్య నగరమైన చాంగ్ చున్ లో కొత్త వేరియంట్ బయటపడడంతో అధికారులు లాక్ డౌన్ విధించిన పరిస్థితి నెలకొంది. దీంతో కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షలు జనాభా ఉన్న చాంగ్ చున్ లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఎవరూ బయటకు రావద్దని కఠిన లాక్ డౌన్ విధించారు. ఆంక్షలు విధించారు. ఫ్యామిలీలోని ఒక్కరూ మాత్రమే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. అది రెండురోజులకు ఒక్కసారేనని ఆంక్షలు విధించారు. కోవిడ్ కేసులు పెరగడంతో స్కూల్స్ మరోసారి మూసివేశారు.
శుక్రవారం ఒక్కరోజే చైనాలోని చాంగ్ చున్ లో 1000 కేసులు నమోదయ్యాయి. వారంలోపే 300 కేసులు నమోదు కావడంతో మరోసారి చైనాలో కోవిడ్ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రపంచదేశాలన్నీ కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి బయటపడుతున్న వేళ చైనాలో మాత్రం మళ్లీ కేసులు పెరగడం.. లాక్ డౌన్ పడడం ఆందోళన కలిగిస్తోంది. అత్యవసరంకానీ సేవలను రద్దు చేశారు. ట్రాన్స్ పోర్టు లింకులను కూడా మూసివేశారు. ఆ నగరానికి రాకపోకలు నిషేధించారు. ఇలా ప్రపంచం అంతా తెరుచుకుంటుంటే చైనా మాత్రం లాక్ డౌన్ తో మూసేయడం గమనార్హం. కరోనా పుట్టిన చోటే మరోసారి వైరస్ విజృంభిస్తుండడంతో ఇది ప్రపంచానికి పాకుతుందా? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Janasena : జనసేన సైన్యంలోకి మరికొందరు..