Jagan- AP Police: ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ రాష్ట్రంలోని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇన్నాళూల ఇవన్నీ కేవలం రోపణలే అనుకున్నారు. సాధారణంగా పోలీసులు ప్రభత్వంలో ఎవరు ఉన్నా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి కాస్త అనుకూలంగా ఉండడం సహజం. కానీ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు తీరు అందరూ ముక్కున వేలేసుకునేలా ఉంది. పోలీసులు జగన్‌పై అతిప్రేమ వొలకబోస్తున్నారు. పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇందుకు నిదర్శనం.

పార్టీ స్టిక్కర్లు అంటిస్తూ..
తాజాగా ఏపీ పోలీసులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర ల్ అవుతోంది. దీనిని పార్టీలకు అతీతంగా ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఏముందంటే.. పోలీసులు అధికార వైసీపీకి చెందిన ప్రచార స్టిక్కర్లు ఆటోలకు అంటిస్తూ కనిపించారు. వైసీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన విశాఖ గర్జనకు సబంధించిన స్టిక్కర్లను వైసీపీ నేతలు ముద్రించారు. వీటిని పారీ కార్యకర్తలే అంటించుకోవాలి. వాహనాలకు అంటించాలంటే వాహన డ్రైవర్ లేదా యజమాని అనుమతి తీసుకోవాలి. ఇళ్ల తలుపులకు, గేట్లకు అంటించాలంటే ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలి.
పోలీసులకు అంటిస్తే అభ్యంతరం ఉండదని..
వైసీపీ సర్కార్‌పై ప్రస్తుతం ఏపీలో సర్వత్రా వ్యతిరేకత పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి సబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు ఇళ్లకు, వాహనాలకు అంటించడానికి ప్రజలు ఒపుపకోవడం లేదని సమాచారం. కేవలం వైసీపీ కార్యకర్తలు మాత్రమే తమ ఇళ్లముందు, ఇళ్లపై, సొంత వాహనాలకు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖ గర్జనను విజయవంతం చేయడానికి ముద్రించిన పోస్టర్లు అంటించడానికి అమరావతి ప్రజలు, వాహనదారులు అంగీకరించలేదు. దీంతో వైసీపీ నాయకులు ఆ స్టిక్కర్లను అంటించే బాధ్యతను పోలీసులకు అప్పగించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వైసీపీపీ, జగన్ సేవలో తరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీస్ శాఖకే మాయని మచ్చగా..
పోలీసులు ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించడం సాధారణమే. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ పోలీసులను తమ బానిసల్లా మార్చుకున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసిన వారు విమర్శిస్తున్నారు. ప్రమోషన్ల కోసం, నచ్చిన చోటుకు బదిలీ చేయించుకునేందుకు పోలీస్ అధికారులు దిగజారుతున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పోలీస్ అధికారులు తమ మెప్పు కోసం కిందస్థాయి సిబ్బందితో ఇలా పార్టీ కార్యక్రమాలు చేయిస్తున్నారని మరికొందరు పేర్కొంటున్నారు. గులాంగిరి చేసే అధికారులు ఉన్నంత వరకు పోలీసులు బానిసలుగా పనిచేయడం తప్పదని కొంతమంది విమర్శిస్తున్నారు. పోలీస్ టోపీపై ఉండే మూడు సింహాలు తలదించుకునే పని అని ధ్వజమెత్తుతున్నారు.

అధికారం శాశ్వతం కాదు..
అధికారం ఏ పార్టీకీ శాశ్వతం కాదు. ప్రజల తీర్పును బట్టే.. ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చూస్తుంటే జగన్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. మూడు రాజధానుల విషయంలో గానీ, ప్రాజెక్టులు పూర్తి చేయడం విషయంలోగానీ, రోడ్ల నిర్మాణం విషయంలో.. జనం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు అప్పులు కొండలా పెరుగుతున్నాయి. డబ్బులు పంచడమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తోంది. దీంతో అభివృద్ధి, సంపద పెంపు జరుగడం లేదు. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం జనసేన అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ చేస్తున్న అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ›‘ప్రతీది గుర్తుపెట్టుకుంటాం.. ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అన్నిటికి సమాధానం చెబుతాం’ అంటూ పాలకులను హెచ్చరిస్తున్నారు.