Balakrishna Daughter Tejaswini: తెలుగు సినిమాల్లో చాలా మంది హీరోలు తమ కుమారులను దించారు. కానీ కూతుళ్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది చాలా తక్కువ మందే. కానీ లెటెస్టుగా బాలకృష్ణ తన చిన్న కూతురును టాలీవుడ్ కు తీసుకొస్తున్నారట. బాలకృష్ణ కు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. పెద్దమ్మాయి బ్రాహ్మిణి.. మాజీ సీఎం చంద్రబాబు కోడలు అని తెలుసు. చిన్నమ్మాయి తేజస్విని కూడా ప్రముఖుడి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక కుమారుడు మోక్షజ్ఞ ను త్వరలో చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ముహూర్తం కుదరడం లేదు. కానీ ఇంతలో బాలకృష్ణ చిన్న కూతురు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే..?

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బాలకృష్ణ.. ‘అన్ స్టాపబుల్’ ప్రొగ్రామ్ తో మంచి ఫాంలో ఉన్నాడు. ఓటీటీ వేదికగా సాగుతున్న ఈ షో కు సినీ, రాజకీయ ప్రమఖులను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని కూడా ఈ ప్రొగ్రాంకు ఆహ్వానించారు. అయితే ‘అన్ స్టాపబుల్’ షో సక్సెస్ వెనుక బాలకృష్ణ కూతురు తేజస్విని సహకారం కూడా ఉందట. ఎందుకంటే ఈ షో కు ఆమె కన్సల్టెంట్ బాధ్యతలు నిర్వహిస్తోంది. బాలయ్య స్క్రిప్టుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటుందని సమాచారం.
‘అన్ స్టాపబుల్’ షో ను సక్సెస్ చేయడంలో మంచి పట్టు సాధించిన తేజస్విని ఇక సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టనుందట. అయితే చాలా మంది హీరోయిన్ గానా..? అని అనుకున్నారు. కానీ నిర్మాతగా ఆమె ఎంట్రీ ఇవ్వనున్నారు. త్వరలో ఆమె నిర్మాణ సారథ్యంలో కొన్ని సినిమాలు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్లో మూవీ మేకింగ్ అవుతోంది. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉంది.

అయితే ఆ తరువాత బాలకృష్ణ చేయబోయే సినిమాకు తేజస్విని నిర్మాతగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. కేవలం నిర్మాతగానే కాకుండా సినిమా స్క్రిప్టు లో కూడా పాలుపంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇన్నాళ్లు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అందరూ ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమె కూతురు తేజస్విని సినీ ఎంట్రీపై అంతా షాక్ అయ్యారు. ఇక ఫ్యాన్స్ మాత్రం నందమూరి వంశం నుంచి మరొకరు సినీ ఇండస్ట్రీకి రావడంపై ఖుషీ అవుతున్నారు.