https://oktelugu.com/

ఏపీ పరిషత్ ఎన్నికలు.. ‘తగ్గేదే లే’!

ఏపీలో పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్వహించిన ఈ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గేదే లే అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని హైకోర్టు అయినా..సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే తేల్చుకోవడానికి రెడీ అవుతోంది. ఏపీలో పరిషత్ ఎన్నికల వ్యవహారంలో రీనోటిపికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ సర్కార్ తేల్చుకునేందుకు రెడీ అయ్యింది.దీనిపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే డివిజన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 25, 2021 6:32 pm
    Follow us on

    Jagan Sarkar

    ఏపీలో పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్వహించిన ఈ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గేదే లే అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని హైకోర్టు అయినా..సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే తేల్చుకోవడానికి రెడీ అవుతోంది.

    ఏపీలో పరిషత్ ఎన్నికల వ్యవహారంలో రీనోటిపికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ సర్కార్ తేల్చుకునేందుకు రెడీ అయ్యింది.దీనిపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే డివిజన్ బెంచ్ స్టే విధించింది.

    సింగిల్ బెంచ్ ఇచ్చిన ఎన్నికల రద్దు ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీనిపై జూన్ 27న విచారణ జరుపుతామని తెలిపింది. దీంతో ఏపీలో పరిషత్ ఎన్నికలు లెక్కింపు జరుగుతాయా? లేదా మొత్తమే రద్దు అవుతాయా? అన్న టెన్షన్ వెంటాడుతోంది.

    ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం తాము హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించామని.. ఈసీకి బ్యాలెట్ బ్యాక్సులు తిరిగి ఇవ్వాల్సి ఉందని.. అందుకే వెంటనే ఓట్ల లెక్కింపునకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే ఇప్పట్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు లేవని.. తొందరపడవద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది.