
సీఎం కేసీఆర్ తో టీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం అడ్డగూడురు పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కు గురైన మరియమ్మ విషయమై సీఎంను కలిసామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మరియమ్మ లాకప్ డెత్ ఘటనను సీఎం దృష్టికి తెచ్చామని భట్టి పేర్కొన్నారు. మరియమ్మ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని భట్టి తెలిపారు.