పరిణతి సాధిస్తున్న లోకేష్

నారా లోకేష్ సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందారు. ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన వైఖరి వెల్లడించే లోకేష్ ఇటీవల బాగా పాపులర్ అయ్యారు. అన్ని విషయాలపై థ్యాంక్యూ లోకేషన్న హ్యాష్ ట్యాగ్ ద్వారా ట్వీట్లు చేస్తుంటారు. ఈ మధ్య అందులో సామాన్యులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో లోకేష్ తన మనసులోని మాటలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. దీంతో ప్రజల్లో అప్పుడప్పుడు చులకన అవుతున్నా ఇప్పుడు మాత్రం మంచి క్రెడిట్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ […]

Written By: Srinivas, Updated On : June 25, 2021 7:18 pm
Follow us on

నారా లోకేష్ సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందారు. ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన వైఖరి వెల్లడించే లోకేష్ ఇటీవల బాగా పాపులర్ అయ్యారు. అన్ని విషయాలపై థ్యాంక్యూ లోకేషన్న హ్యాష్ ట్యాగ్ ద్వారా ట్వీట్లు చేస్తుంటారు. ఈ మధ్య అందులో సామాన్యులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో లోకేష్ తన మనసులోని మాటలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. దీంతో ప్రజల్లో అప్పుడప్పుడు చులకన అవుతున్నా ఇప్పుడు మాత్రం మంచి క్రెడిట్ సాధించారు.

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని పోరాడారు. పరీక్షలు రద్దయ్యే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కేంద్రానికి సైతం లేఖ రాశాడు. సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం గురువారం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లోకేష్ కు ట్వీట్లు పెరిగాయి. లోకేష్ చేసిన పోరాటానికి తగిన న్యాయం జరిగిందనే విషయంపై పొగుడుతూ ట్వీట్లు పెరిగాయి.

పరీక్షల రద్దు విషయంలో లోకేష్ వాయిస్ వినిపించిన మాట వాస్తవమే. విద్యార్థుల తల్లిదండ్రుల్లో లోకేష్ పట్ల సానుకూల అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం మొదలుపెట్టిన థ్యాంక్యూ లోకేషన్న హ్యాష్ ట్యాగ్ కు సామాన్యులు సైతం స్పందిస్తున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ లతో వార్తల్లో నిలిచే లోకేష్ కు ఇది భిన్నమన అనుభవమే.

ఒక్కోసారి ప్రెస్ మీట్లలో కూడా తడబడే లోకేష్ ఇప్పుడు పాజిటివ్ దృక్పథంతో కనిపించడం మామూలే. ఎమ్మెల్సీగా నామినేట్ అయి మంత్రి పదవి చేపట్టడం కూడా వ్యతిరేకతకు ఒక కారణమే. ప్రత్యర్థులు అతడిని సోషల్ మీడియా వేదికగా అన్ పాపులర్ చేయాలని చూస్తుంటారు. అయితే ఇటీవల ఆయన తన వైఖరిలో మార్పు సాధించడంతో ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కూడా రాటు దేలినట్లు కనిపిస్తోంది.