MLA Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా చిరకాల వాంఛ తీరడం లేదు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న ఆమెకు మంత్రి పదవి మాత్రం ఎప్పుడూ ఊరిస్తూనే ఉంది. చివరకు కోరిక నెరవేరడం లేదు. దీంతో ఆమె నిరసనకు గురవుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆమెకు మంత్రి పదవి మాత్రం దరి చేరడం లేదు. దీంతో తన మనసులోని బాధను వెళ్లగక్కుతున్నా పట్టించుకునే వారు లేరు. ఈ నేపథ్యంలో రోజాకు మరోమారు మంత్రి పదవి దక్కుతుందో? లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మారుతున్న రాజకీయాల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దగ్గరగా వచ్చి దూరం పోతోంది. సామాజిక అంశాల ఆధారంగానే ఆమెకు పదవి రావడం లేదని తెలుస్తోంది. చిత్తూరులో ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు మంత్రి పదవుల్లో ఉండటంతో ఆమెకు మొండిచేయి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఈ సారి మాత్రం మంత్రి పదవి దక్కకపోతే ఇక ఊరుకోరనే వాదన కూడా వస్తోంది.
మరోవైపు ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే ఆమెకు వ్యతిరేకంగా అసమ్మతి కుంపటి రాజేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా చేయాలనే చూస్తున్నారు. దీంతో రోజాకు పలు సమస్యలు చుట్టు ముడుతున్నట్లు భావిస్తున్నారు. ఈ తరుణంలో రోజాకు మంత్రి పదవి దక్కుతుందా? అనే సంశయాలు అందరిలో వస్తున్నాయి. దీనిపై రోజా ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు.
Also Read: టీఆర్ఎస్ నేతలకు ప్రజాప్రయోజనాలు పట్టవా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సూటి ప్రశ్న
ఈ క్రమంలో వైసీపీలో పేరున్న నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న రోజాకు ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఆమెకు మంత్రి పదవి ఇస్తారో లేదో చూడాల్సిందే. కానీ వైసీపీకి అండగా నిలిచిన వారిలో రోజా కూడా ఒకరు కావడం తెలిసిందే. దీంతో జగన్ తమ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
సీఎం జగన్ మదిలో ఏముందో అర్థం కావడం లేదు. ఎవరెవరికి మాట ఇచ్చారో? ఎవరికి మంత్రి పదవులు కేటాయిస్తారో అంతుచిక్కడం లేదు. దీంతో రోజా తీరని కోరిక తీరేనా? లేదా అనే వాదన అందరిలో వస్తోంది. ఏదిఏమైనా కాలమే మంత్రి పదవులపై సమాధానంచెబుతుందని అందరు ఎదురు చూస్తున్నారు.
Also Read: రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ సహకరించదా?