Bandi Sanjay vs TRS: టీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ లో ప్రవర్తించిన తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఆక్షేపించారు. ఏదో ఆశించి వారు చేస్తున్న ప్రయత్నాలు తప్పని సూచించారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడకుండా ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగడం వారి తెలివి తక్కువ తనానికే నిదర్శనమని వ్యాఖ్యానించారు. లేనిపోని అభాండాలు వేస్తూ సభ నిర్వహణ సాగకుండా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా టీఆర్ఎస్ ఇలాగే చేసి అభాసుపాలైంది. ప్రస్తుతం ప్రధానిని లక్ష్యంగా చేసుకుని అనవసర ప్రేలాపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పిదాలపై వారికి తెలియకపోవడం విడ్డూరమే అని చెబుతున్నారు. కానీ టీఆర్ఎస్ ఎంపీల తీరు అభ్యంతకరంగా ఉన్నా వారు పట్టించుకోవడం లేదు.
Also Read: రోజాకు ఈసారైనా మంత్రి పదవి దక్కేనా? ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకుంటారా?
ప్రధాని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. విభజన సరైన విధంగా చేయలేదని చెప్పారని తెలిపారు కానీ టీఆర్ఎస్ నేతలే ప్రధాని మాటల్ని వక్రీకరిస్తూ తమ తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన కేసీఆర్ పై ఏం కేసులు పెట్టాలో వారే చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలా వారి తప్పులను మానేలా చేసేందుకే ప్రధాని పై ఆరోపణలు చేయడం వారిలో అనైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ప్రజాప్రయోజనాలు మరిచిపోయి స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారి తప్పులను దాచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. దీంతోనే ప్రధాని మోడీపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నారు. దీనికే సభా హక్కుల నోటీసు ఇవ్వడం తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పై ఎన్ని నోటీసులు ఇవ్వాలని ప్రశ్నించారు. లేని పోని విధంగా రాద్దాంతాలు చేయడం మానుకుని సభా నిర్వహణకు సహకరించాలని సూచిస్తున్నారు.
Also Read: రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ సహకరించదా?