22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

వైసీపీ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త మంత్రులను ప్రాంతాల ప్రాతిపదికన కాకుండా సామాజిక వర్గాల ప్రాతిపదికనే ఎంపిక చేశారు. మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారిలో రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, శ్రీకాకుళం నుంచి పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులు ఉన్నారు. వీరిద్దరికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీ […]

Written By: Neelambaram, Updated On : July 20, 2020 9:36 pm
Follow us on


వైసీపీ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త మంత్రులను ప్రాంతాల ప్రాతిపదికన కాకుండా సామాజిక వర్గాల ప్రాతిపదికనే ఎంపిక చేశారు. మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారిలో రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, శ్రీకాకుళం నుంచి పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులు ఉన్నారు. వీరిద్దరికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు.

ఎమ్మెల్సీ రేసు.. నేతల్లో పెరుగుతున్న టెన్షన్..!

గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కొత్త మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది మంది ముఖ్య నేతలు, అధికారులు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఇస్తారు. మరోవైపు రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఇప్పటికే తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా సర్పించగా, గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది.

గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకట రమణ మత్యకార సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం జిల్లాలోని అదే సామాజిక వర్గానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు అవకాశం ఇచ్చారు. ఆయనకు మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలు అప్పగించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ కు మంత్రిగా అవకాశం లభించింది. ఆయనకు రెవెన్యూ శాఖ కేటాయించనున్నారు.

జమిలి ఎన్నికలతో మునిగేది చంద్రబాబేనా?

బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇతర నేతలు కొందరు మంత్రి పదవులు కేటాయింపుపై అసంతృప్తితో ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ రేసులో ఉన్నారు. జోగికి మంత్రి పదవి కేటాయించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొందరు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్ధసారధి వై.ఎస్ హయాంలో మంత్రిగా పని చేశారు. ఆయన మంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నారు. అసంతృప్తులను బీసీ కార్పొరేషన్ పదవులు భర్తీ చేసే సమయంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.