Controversy Senior NTR And Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చే పాత్రలు అల్లూరి సితారామరాజు.. జేమ్స్ బాండ్.. కౌబాయ్ వంటి చిత్రాలు. ఇలాంటి పాత్రలకు ఆద్యుడు హీరో కృష్ణ అనే చెప్పాలి. ఈయన తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించి సూపర్‌స్టార్ గా ఎదిగాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు. ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలుస్తూ కొత్తగా ట్రై చేసేవాడు. తెలుగు ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ కూడా. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ప్రస్తుతం ఆయన కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ నట వారసత్వాన్ని టాలీవుడ్‌లో కొనసాగిస్తున్నాడు.
31 మే 1943లో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన సూపర్ స్టార్ కృష్ణ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన తేనె మనసులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ గూడాచారి 116, మోసగాళ్లకు మోసగాడు కౌబాయ్ సినిమాలు చేశారు. తన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంతంగా పద్మాలయ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు.
Also Read: AP New Districts: అరుదైన సందర్భం: ఇద్దరు ఐఏఎస్ లు , ఇద్దరు ఐపీఎస్ లు ఒకే జిల్లాల్లో పోస్టింగ్..
అయితే 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఎన్.టి.రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విజయ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల అయింది. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలకు రాజకీయ కోణాన్ని ఇచ్చింది. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకా ఈ విభేదాలు రాజుకున్నాయి. కాగా 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లాడు. అదే సమయంలో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ, కృష్ణ కలిశారు. ఎన్టీ రామారావులాగా అలాంటి ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తాడని కాంగ్రెస్ నాయకులు భావించారు. 1984లో కృష్ణ ఫ్యామిలితో వెళ్లి రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత కృష్ణ ఎన్టీరామారావు ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ పలు సినిమాలు చేశాడు.
అయితే నాదెండ్ల ఎపీసోడ్ తర్వాత ఎన్టీ రామారావు మళ్లి ఎన్నికలకు వెళ్లారు. ఆ టైంలో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రాచారం నిర్వహించారు. ఆయన ఎన్నికల సభలకు జనం పెద్దఎత్తున వచ్చేవారు. ఎన్టీరామారావు ను విమర్శిస్తుండగా ప్రజల నుంచి స్పందన వచ్చేది. అయితే నంద్యాల సభలో కృష్ణ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఎన్టీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. సభ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కృష్ణ కారుపై కొంతమంది రాళ్లతో దాడి చేశారు. దీంతో కృష్ణకు చిన్న గాయం అవడంతో ఆస్పిటల్ ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నారు.
అప్పట్టో ఈనాడు రామోజీరావు బహిరంగంగానే టీడీపీకి మద్దతు ఇచ్చేవారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత రోజు కృష్ణ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. తనపై దాడికి టీడీపీ.. ఈనాడు బాధ్యత వహించాలని ఆరోపించారు. ఈనాడు విలేకర్లకు కళ్లు, చెవులు పనిచేయడం లేదని అన్నారు. తన సభకు లక్షలాది జనం హాజరైతే కేవలం 1500 మందే హాజరయ్యారని రాశారని విమర్శించారు కూడా. దీంతో మర్నాడే ఈనాడు ఫ్రంట్ పేజీలో కృష్ణ విమర్శలను, ఆరోపణలను ప్రచురించింది. ఓ వివరణ ఇస్తూ ఖండించింది కూడా. దీంతో కృష్ణ సినిమాల కవరేజీ ఈనాడులో ఉండేది కాదు. ఇక ఆ తర్వాతి కాలంలో సూపర్ స్టార్ కృష్ణ, రామోజీరావులు కలిసిపోయారు.
Also Read:Mahesh Babu Okkadu Sister: మహేష్ చెల్లెలు ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?