Homeఆంధ్రప్రదేశ్‌AP New Districts: కొత్త జిల్లాల్లో బోలెడ‌న్ని డిమాండ్లు.. జ‌గ‌న్ ప‌ట్టించుకుంటారా.. ప‌క్క‌కు పెడ‌తారా..?

AP New Districts: కొత్త జిల్లాల్లో బోలెడ‌న్ని డిమాండ్లు.. జ‌గ‌న్ ప‌ట్టించుకుంటారా.. ప‌క్క‌కు పెడ‌తారా..?

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల పాల‌న‌పై జ‌గ‌న్ దృష్టి పెడుతున్నారు. ఉగాది త‌ర్వాత కొత్త జిల్లాల్లో పాల‌న ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలోనే కొత్త జిల్లాల్లో చాలా స‌మ‌స్య‌లు, డిమాండ్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అస‌లే ఏపీ అప్పుల్లో కూరుకుపోయి ఉంది. కాబ‌ట్టి అక్క‌డి నుంచి వ‌స్తున్న డిమాండ్లు ఇప్పుడు జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిపోయాయి. మొద‌టి నుంచి జిల్లాల పేర్లు జ‌గ‌న్‌కు ఇబ్బంది క‌రంగా ఉన్న విష‌యం తెలిసిందే.

AP New Districts
AP CM Jagan

కానీ ఇప్పుడు కొత్త జిల్లాల్లో ఏమేం ఉండాలో, ఏమేం కావాలో.. ఇలా అనేక విష‌యాల‌పై ఎమ్మెల్యేలు, మంత్రుల ద‌గ్గ‌రి నుంచి జ‌గ‌న్‌కువ విన‌తులు వ‌స్తున్నాయి. అయితే వీట‌న్నింటిపై జ‌గ‌న్ చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రెవెన్యూ డివిజ‌న్ల మార్పులు, పైగా జిల్లా కేంద్రాలు దూరంగా ఉండ‌టంతో.. పాటు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ఆధారంగా కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తే.. పాత జిల్లా కేంద్రాలు త‌మ కొత్త జిల్లాల ప‌రిధిలో లేక‌పోవ‌డాన్ని చాలామంది వ్య‌తిరేకిస్తున్నారు.

Also Read: BJP vs TRS: కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ ‘తీర్మానాల’ పోరు.. ఫలిస్తుందా?

పైగా కొత్త జిల్లాల్లో క‌లెక్ట‌రేట్లు, ఇత‌ర ఆఫీస‌ర్ల బిల్డింగులు క‌ట్ట‌డం అంటే చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. ఇవ‌న్నీ ఇప్పుడు జ‌గ‌న్ ముందుకు వ‌స్తున్న పెద్ద డిమాండ్లు. ఈ నెల 31న కొత్త జిల్లాల మీద ఫైన‌ల్ నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ ఈ నోటిఫికేష‌న్ వ‌చ్చే లోగానే కొత్త జిల్లాల మీద దాదాపు 11వేల అభ్యంతాలు వెల్లువెత్తాయి.

చాలా చోట్ల జిల్లాల విభ‌జ‌న అనేది ప్రాతిప‌దిక‌న జ‌ర‌గ‌లేద‌ని, జాత జిల్లా కేంద్రాలు లేక‌పోతే ఎలాంటి డెవ‌ల‌ప్ మెంట్ జ‌ర‌గ‌ద‌ని చాలా చోట్ల నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మ‌డి జిల్లాల్లో ఉన్న‌ప్పుడే ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి డెవ‌ల‌ప్ చేయ‌లేదు.. అలాంటిది ఇప్పుడు కొత్త జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి ఉంటుంద‌ని వాపోతున్నారు అక్క‌డి జ‌నాలు. ఇదే విషయాన్ని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ఒత్తిడి పెంచుతున్నారు.

కొన్ని చోట్ల పాత జిల్లాల నుంచి ఇతా జిల్లాల మండ‌లాల‌ను క‌లుపుతూ జిల్లాలుగా విభ‌జించ‌డం కూడా వివాదాల‌ను రాజేస్తోంది. హిందూపురం నుంచి మొద‌లు పెడితే.. రాజంపేట, న‌ర్సాపురం జిల్లా కేంద్రాల వివాదం రాజుకుంటోంది. ఇక కొన్ని జిల్లాల‌కు పేర్ల వివాదం ఉంది. ఇందులో చూసుకుంటే తిరుప‌తికి శ్రీబాలాజీ పేరు పెట్ట‌డంతో పాటు.. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డం ఇంకా వివాదంలోనే ఉంది.

AP New Districts
CM YS Jagan

ఇక రంపచోడవరం, మదనపల్లిల‌ను కొత్త జిల్లాలుగా చేయాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్లు వ‌స్తున్నాయి. మ‌రి నాలుగు రోజుల్లో ఫైన‌ల్ నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని చూస్తున్న జ‌గ‌న్‌.. వీట‌న్నింటినీ పెండింగ్‌లోనే పెట్టి నోటిఫికేస‌న్ ఇస్తారా.. లేదంటే వాటికి ఏమైనా ప‌రిష్కారాలు చూపిస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మిగిలింది నాలుగు రోజులే కాబ‌ట్టి.. ఇన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం మాత్రం క‌ష్ట‌మే అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి వీటిని ఇలాగే పెండింగ్ లో పెట్టి నోటిఫికేష‌న్ ఇస్తే మాత్రం.. నిర‌స‌న‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

Also Read: Ukraine Crisis: 300 మంది బలి: రష్యా పంతం.. ఉక్రెయిన్ పట్టుదల.. మధ్యలో ప్రజలే సమిధలు!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

6 COMMENTS

  1. […] Vijaya Sai Reddy: ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెత్తనాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా? తమని కాదని అధిష్టానం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారా? అంటే వైసీపీ శ్రేణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డి నియమించిన నాటి నుంచే వారంతా కీనుక వహిస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన నాయకులు ఇప్పడు సైలెంట్ అవ్వడం ఇదే కారణమని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీ సీనియర్ నాయకులకు కొదువ లేదు. […]

  2. […] CM Jagan Three Capital Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను నానా తిప్పలు పెడుతోంది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చినా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదు. దీంతో ప్రజాగ్రహానికి గురవుతోంది. ఇక మూడు రాజధానుల వ్యవహారం సర్కారు మెడకు పాములా చుట్టుకుంటోంది. మూడు రాజధానుల పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి ఇతర విషయాల మీద లేదు. అభివృద్ధిపై అసలే లేదు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కానరావడం లేదు. […]

  3. […] CM KCR: ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని ఓ సమస్య తెలంగాణలోనే ఉంది. అదే వడ్ల కొనుగోలు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదని కేసీఆర్ ప్రభుత్వం నానా రాద్ధాంతం చేస్తోంది. కానీ కేంద్రం ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వమే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఒప్పందం చేసుకుందని చెబుతోంది. కానీ కేసీఆర్ ప్రభుత్వమేమో కేంద్రమె మెడ మీద కత్తి పెట్టి రాయించుకుందని.. ఇప్పుడు తమ వడ్లు కొనాలి అంటూ డిమాండ్ చేస్తోంది. […]

  4. […] CAG Report On AP: ప్రభుత్వ నిర్ణయాలు, ఉద్దేశాలు, ఖర్చులు తదితర వాటిని కాగ్ నివేదిక బయటపెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కాగ్ నివేదిక గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో అందరిలో అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు కాగ్ రిపోర్టు ఇవ్వలేదా? లేక ప్రభుత్వమే బయటపెట్టలేదా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల భారంలో పడిపోవడంతో కాగ్ నివేదికపై అందరికి ఆసక్తి నెలకొన్నా దానికి సంబంధించిన నివేదక మాత్రం బయటకు రాకపోవడం గమనార్హం. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular