AP- KCR: టీఆర్ఎస్ పార్టీ అదినేత కేసీఆర్ మూడో కూటమి ఏర్పాట్లపై ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర పక్షానికి నాయకత్వం వహించాలని బావిస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాల సీఎంలను కలుస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వంటి వారిని కలిసి వెంట రావాలని కోరిన సంగతి తెలిసిందే. దీంతో మూడో కూటమి ఏర్పాటు తథ్యమేననే వాదనలు వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి గా మార్చేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించి ఉండాలనే నిబంధన ఉండటంతో కేసీఆర్ ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఓటు బ్యాంకు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేసి అక్కడ కూడా తమకు ఓటు బ్యాంకు ఉందని నిరూపించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Minister KTR: రాజుతో కయ్యం.. మంత్రులతో నెయ్యం.. కేటీఆర్ కొత్త స్ట్రాటజీ ఇదేనా
ఆంధ్ర ప్రజా సమితి అధ్యక్షుడు సురేందర్ రెడ్డి కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని మోడీని ఎదిరించే సత్తా కేసీఆర్ కే ఉందని కితాబిస్తున్నారు. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ ను కలిసి సమాలోచనలు జరిపినట్లు తెలిసిందే. దీంతో ఆయనను టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాధ్యుడిగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఆంధ్రలో కూడా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్లు సమాచారం.

తెలంగాణలో వైఎస్ షర్మిల కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టడంతో అక్కడ కేసీఆర్ కూడా టీఆర్ఎస్ ను పోటీలో దింపాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. కానీ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను నెలకొల్పానే ఉద్దేశంతోనే ఆంధ్రలో కూడా పోటీ చేసి ఓటు బ్యాంకు చూపించుకోవాలని బావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ పార్టీని నాలుగు రాష్ట్రాల్లో పట్టు నిరూపించుకోవాల్సి రావడంతో ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు చూపించుకోవడానికి పోటీ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read:RSS- Maharashtra Political Crisis: ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడ.. ‘మహా’ సంక్షోభంపై అందుకే స్పందించడం లేదా!?