Prudhvi Raj Open Heart With Rk: తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకుండవట. అలాంటి ప్రతిభ దక్కించుకున్న సినీనటుడు పృధ్వీ ఎదుటి వారిని విమర్శించడంలో ఆరితేరారు. వైసీపీలో ఉండగానే టీడీపీ, జనసేన అనే తేడా లేకుండా అందరిని కడిగేశారు. దీంతో ఆయన వైసీపీ సర్వం చూసుకుంటుందని అనుకున్నారు. కానీ తరువాత వైసీపీ పట్టించుకోకపోవడంతో పరిస్థితి తారుమారైంది. విధి వెక్కిరించింది. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒకటి కావడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. వైసీపీని నమ్ముకున్నా నట్టేట మునిగినట్లు తెలుసుకున్నా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి.

ప్రభుత్వమే నా వెంట ఉందనే ఉద్దేశంతో పృథ్వీ నోటికొచ్చినట్లు మాట్లాడి లేనిపోని కష్టాలు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడిగా మారాడు. ఇటు వైసీపీ కాదనడంతో పార్టీలో స్థానం లేకుండా పోయింది. అటు సినిమా రంగం కూడా దూరం పెట్టడంతో అవకాశాలు రావడం లేదు. ఫలితంగా కష్టాల్లో పడిపోయాడు. ఈనేపథ్యంలో పృధ్వీకి ప్రస్తుతం ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. భవిష్యత్ లో మరిన్ని సమస్యల్లో ఇరుక్కోనున్నట్లు తెలుస్తోంది.
Also Read: CM Jagan- Early Elections: 2023 మార్చిలోపే షాకివ్వడానికి జగన్ రెడీ!
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పృధ్వీతో ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో పిలవడంతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. వైసీపీని ఓ ఉగ్రవాద సంస్థగా అభివర్ణిస్తున్నట్లు సమాచారం. అందులో ఉన్న వారిని ఉగ్రవాదులుగానే పరిగణిస్తున్నారు. తనను కూడా ఓ ఉగ్రవాదిగానే భావించుకుంటున్నట్లు వివరించడం తెలిసిందే. దీంతో వైసీపీపై ఆయనకున్న కోపం ఎంతో తెలుస్తోంది. ఈ క్రమంలో పృధ్వీని ఆర్కే వైసీపీపై ప్రయోగించే బాంబుగానే చూస్తున్నట్లు చెబుతున్నారు.

వైసీపీలో నిజాయితీకి అర్థం లేదని సూచిస్తున్నారు. పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పృధ్వీ లాంటి వారిని పార్టీ పట్టించుకోవడం లేదు. పక్కన పెట్టేస్తోంది. ఫలితంగా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వైసీపీని నమ్ముకుని అందరిని తిట్టడంతో సినిమాల్లో కూడా అవకాశాలు లేకుండా పోయాయి. రోజుకు రూ. లక్షలు తీసుకునే పృధ్వీ ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. మొత్తానికిక వైసీపీ మాయలో పడి తన భవిష్యత్ నే భగ్నం చేసుకున్న బాధితుడిగా పృధ్వీ నిలుస్తున్నాడనడంలో అతిశయోక్తి లేదని తెలుస్తోంది.
Also Read:Bandi Sanjay: ఇలా చేస్తే బండి సంజయ్ భద్రతకు ముప్పే
[…] […]