
ఏపీలో మొన్నటి వరకు నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. మరికొద్ది రోజుల్లో మున్సి‘పోల్స్’ జరగబోతున్నాయి. అయితే.. ఇప్పటికే మేయర్ పంచాయతీల్లో సానుకూల ఫలితాలు సాధించమని అనుకుంటున్న టీడీపీ.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఫలితాలు రాబడుతామని ధీమాతో కనిపిస్తోంది. అందుకే.. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
Also Read: పార్టీ ప్రకటించకముందే షర్మిలపై విమర్శల ట్రోల్స్
ఇందుకోసం ఆ పార్టీ జగన్‌కు ఓటేస్తే పన్నులు బాదేస్తారని ప్రచారం చేస్తోంది. ఇటీవల అదనపు అప్పుల కోసం పట్టణ సంస్కరణలు అమలు చేయడానికి ఏపీ సర్కార్ అంగీకరించింది. దాని ప్రకారం పట్టణాల్లో పెద్ద ఎత్తున పన్నులు పెంచాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆస్తి పన్ను విధిస్తారు. ఇలా చేస్తే పెద్ద ఎత్తున టాక్స్‌లు పెరుగుతాయి. దీనిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. దీన్ని టీడీపీ మరో రేంజ్‌కు తీసుకెళ్తోంది. వైసీపీని గెలిపిస్తే ఎవరి ఇంటికి ఎంత పన్ను పడుతుందో.. వివరిస్తూ ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు.
ప్రజల్లో ఇలాంటి భయాలను నింపి ఓట్లను రాల్చుకోవాలన్న ప్రయత్నంలో ఉంది టీడీపీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఇంటి పన్ను అంశాన్నే హైలెట్ చేయాలని పార్టీ నేతలకు సూచించారు. అంతేకాదు.. తాము గెలిచే మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను పెంచబోమని.. పైగా సగానికి తగ్గిస్తామని హామీ ఇస్తున్నారు. ఇది గేమ్ చేంజర్ అని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. ఇప్పటికే పట్టణాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా ఖర్చును సంక్షేమంపైనే పెడుతోంది. అభివృద్ధిపై పెట్టడం లేదు. నగరాల్లో, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలకూ నగదు వెచ్చించడం లేదు. ఇది కాస్త ఇప్పుడు ప్రతిపక్షానికి కలిసి వస్తోంది.
Also Read: జనసేనలోకి మళ్లీ జేడీ..! రీజాయినింగ్ ఖాయమట?
గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అందుకునేవారు ఎక్కువగా ఉంటారు. పట్టణాల్లో తక్కువ. వాలంటీర్లు పార్టీల వారీగా గుర్తించి పథకాలను పంపిణీ చేస్తున్నారు. దీంతో యాభై ఇళ్లలో పది మందికి కూడా పథకాలు అందని పరిస్థితి. మిగతా నలభై మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నా.. తమ సర్కార్ వచ్చినా పథకాలు ఇవ్వడం లేదన్న అసంతృప్తి వారిలో ఉంది. ఇలాంటి వాటిని ఉపయోగించుకుని ఓట్లుగా మల్చుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వ వ్యతిరేకత ఉందని నిరూపించాలని టీడీపీ అనుకుటోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్