https://oktelugu.com/

జనసేనలోకి మళ్లీ జేడీ..! రీజాయినింగ్ ఖాయమట?

గూటి నుంచి ఎగిరిపోయిన పక్షులకు మరో గూడు దొరక్కా మళ్లీ సొంత గూటికే వస్తున్నాయి.. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయం వదిలేసి సినిమాలు చేస్తున్నందుకు అలిగి వెళ్లిపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా మళ్లీ జనసేనలోకి రీఎంట్రీ ఇవ్వడానికి వస్తున్నారా? పార్టీలో రీజాయినింగ్ అవ్వబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఎవరు ఏ పార్టీల్లో ఉంటారో.. ఏ పార్టీ నుంచి మరే పార్టీకి మారుతారో అస్సలు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 3, 2021 11:57 am
    Follow us on

    గూటి నుంచి ఎగిరిపోయిన పక్షులకు మరో గూడు దొరక్కా మళ్లీ సొంత గూటికే వస్తున్నాయి.. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయం వదిలేసి సినిమాలు చేస్తున్నందుకు అలిగి వెళ్లిపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా మళ్లీ జనసేనలోకి రీఎంట్రీ ఇవ్వడానికి వస్తున్నారా? పార్టీలో రీజాయినింగ్ అవ్వబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

    రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఎవరు ఏ పార్టీల్లో ఉంటారో.. ఏ పార్టీ నుంచి మరే పార్టీకి మారుతారో అస్సలు అర్థం కాదు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజమే.. కానీ సీబీఐ అధికారిగా ప్రజల్లో ప్రత్యేక పేరు తెచ్చుకున్న జే.డి. లక్ష్మీనారాయణ లాంటి వారు సైతం రాజకీయ పార్టీలో చేరడం.. అసంతృప్తితో పార్టీ నుంచి వెళ్లిపోవడం.. మళ్లీ పార్టీలోకి తిరిగి జాయిన్ అవుతుండం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

    అధికారులు రాజకీయ పార్టీల్లోకి వచ్చి నిలదొక్కకున్నవారు కొంతమందే ఉన్నారు. అయితే లక్ష్మీనారాయణ వంటి వారు రాజకీయాల్లో నిలకడగా ఉంటే ప్రజలు ఆదరిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు టేకప్ చేసిన జే.డి. లక్మీనారాయణకు ఆంధ్రలో సొంతంగా అభిమానులు ఉన్నారు. అదే ఊపుతో కొన్నేళ్ల కిందట పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చినా గెలువలేకపోయారు. అయితే ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొన్నా చురుగ్గా మాత్రం లేరనేది చెప్పాలి.

    అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ డీలా పడడంతో జే.డీ. లక్ష్మీనారాయణ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ ఆర్థిక భారంతో వదిలేసిన సినిమాల్లో మళ్లీ నటించాలని డిసైడ్ అయ్యారు. వరుసగా సినిమాలు ఒప్పుకొని బిజీగా మారడంతో పార్టీని పట్టించుకునేవారెవరూ లేరని జేడీ లక్ష్మీనారాయణ అసంతృప్తి చెందారు. దీంతో బహిరంగ లేఖ రాసి జనసేనను వీడుతున్నట్లు అదే కారణంగా చెప్పి తప్పుకున్నారు.

    అయితే ఇటీవల కాలంలో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు పలు కార్యక్రమాల్లో రెండు పార్టీలు కలిసి పాల్గొంటుండడంతో ఇరు పార్టీల నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అటు ఏపీ బీజేపీకి సోము వీర్రాజు ఆధ్వర్యంలో కొత్త నాయకత్వం రావడంతో కమలం పార్టీ బలపడుతుండడంతో ఈ రెండు కూటమిలపై నాయకుల్లో నమ్మకం కలుగుతోంది.. మరోవైపు జనసేన అధినేత కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీల్లోనూ జనసేన గొప్ప ప్రదర్శన చేసింది. రాబోయే ఎన్నికల్లో 2023లో మళ్లీ జనసేన సత్తా చాటడంపై ఆశలు చిగురుస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో జే.డీ. లక్ష్మీ నారాయణ మళ్లీ జనసేనలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు తగిన హామీ ఇస్తే పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి ఈసారైనా జే.డీ. తన రాజకీయ ప్రతాపాన్ని చూపిస్తాడా..? లేదా..? అనేది చూడాలి.