https://oktelugu.com/

ఏపీలో ఇక ‘పుర’ పోరు.. సోమవారమే నోటిఫికేషన్?

ఏపీలో మరో నెలంతా.. ఎన్నికల సందడే నెలకొననుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలతో గ్రామాల్లో సందడి వాతావరణం కొనసాగుతోంది. ఇక త్వరలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఇందుకు ఏపీ సర్కారు కూడా సైతం అనడంతో ఏర్పాట్లలో బిజీగా మారారు అధికారులు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తున్న ఫలితాలతో జోష్ మీదున్న వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ లోనూ ఇదే మూమెంట్ లో పాగా వేయాలని ఆలోచన చేస్తోంది.. ఈ క్రమంలోనే […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 14, 2021 / 02:00 PM IST
    Follow us on


    ఏపీలో మరో నెలంతా.. ఎన్నికల సందడే నెలకొననుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలతో గ్రామాల్లో సందడి వాతావరణం కొనసాగుతోంది. ఇక త్వరలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఇందుకు ఏపీ సర్కారు కూడా సైతం అనడంతో ఏర్పాట్లలో బిజీగా మారారు అధికారులు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తున్న ఫలితాలతో జోష్ మీదున్న వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ లోనూ ఇదే మూమెంట్ లో పాగా వేయాలని ఆలోచన చేస్తోంది.. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది.

    Also Read: బీజేపీ దృష్టిలో పవన్ ఒక డమ్మీనేనా?

    ఆగిపోయిన పరిషత్, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడానికి అభ్యంతరం లేదంటూ.. ఏపీ సర్కారు లిఖిత పూర్వకంగా తెలియజేయడంతో ఎన్నికల కమిషన్ వాటిపై దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున సమాంతరంగా మరో నోటిఫికేషన్ విడుదల చేయడం సాధ్యం కాదు కాబట్టి.. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు, సర్కారు భావిస్తోంది. గతంలో వాయిదా వేసే సమయానికి మున్సిపల్ నామినేషన్లు పూర్తి అయ్యాయి. ప్రచారం కూడా దాదాపు ముగిసింది.

    Also Read: విశాఖ ఉక్కుపై కేంద్రం యూటర్న్..?

    పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు నిర్వహిస్తారా.. లేదా.. ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభిస్తారా..? అన్న దానిపై క్లారిటీ రాలేదు. ఎస్ఈసీ పూర్తిగా.. బలవంతపు ఏకగ్రీవాలు అయిన చోటనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మునిసిపాలిటీల్లో కడప, మాచర్ల వంటి కొన్ని చోట్ల తప్పా.. పెద్దగా అభ్యంతరాలు లేవు. అందుకే నామినేషన్ల వరకు ఓకే చేసి.. ప్రచారానికి కొంత గడువు ఇచ్చి.. ఎన్నికలు పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఎస్ఈసీ వర్గాలు కసరత్తు చేశాయి. 15వ తేదీ.. అనగా.. సోమవారం నోటిఫికేషన్ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఒకవేళ కసరత్తు పూర్తికాలేదని అనుకుంటే.. 17వ తేదీన విడుదల చేస్తారని చెబుతున్నారు. మునిసిపల్ ఎన్నికలు పార్టీల పరంగానే జరుగుతాయి. పార్టీ గుర్తులే ఉంటాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా.. మున్సిపల్ ఎన్నికలు మరింత రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ.. తమ కసరత్తును పూర్తి చేసింది.