https://oktelugu.com/

సాగర్ బరిలో టీడీపీ..

ఇంటగెలవని వారు రచ్చ గెలుస్తామని గొప్పలు చెప్పుకోవడం టీడీపీకే చెల్లుతుందని పలువురు అంటన్నారు. ఎంతో కొంతబలం ఉన్న ఏపీలోనే ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతున్న సైకిల్… తెలంగాణలోనూ మరోసారి సవారీ చేయాలని అనుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నంలో ఉంది. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మొదట భావించగా.. ఇప్పుడు నాగార్జున సాగర్ బరిలో నిలవాలని నిర్ణయించారు. ఆ పార్టీ నాగార్జున సాగర్ ఇన్చార్జి […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 14, 2021 / 02:06 PM IST
    Follow us on


    ఇంటగెలవని వారు రచ్చ గెలుస్తామని గొప్పలు చెప్పుకోవడం టీడీపీకే చెల్లుతుందని పలువురు అంటన్నారు. ఎంతో కొంతబలం ఉన్న ఏపీలోనే ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతున్న సైకిల్… తెలంగాణలోనూ మరోసారి సవారీ చేయాలని అనుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నంలో ఉంది. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మొదట భావించగా.. ఇప్పుడు నాగార్జున సాగర్ బరిలో నిలవాలని నిర్ణయించారు. ఆ పార్టీ నాగార్జున సాగర్ ఇన్చార్జి మువ్వ అరుణ్ కుమార్ ను పోటీలో దింపాలని ఆసక్తి చూపుతున్నారు.

    Also Read: వైఎస్ షర్మిల టార్గెట్ వారేనా..?

    దీనికి టీడీపీ అధిష్టానం కూడా పచ్చజెండా ఊపింది. దీంతో నాగార్జున సాగర్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. జానారెడ్డి అక్కడ తిరుగులేని నాయకుడు. ఎన్నో విజయాలు సాధించారు. అతడికి మొదటి నుంచి టీడీపీనే ప్రత్యర్థిగా ఉంటూ వచ్చింది. 2014 ఎన్నికలలోనూ.. టీడీపీనే జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చింది. ఓసారి అయితే.. చిన్నప్పరెడ్డి జానాను ఓడించినంత పని చేశారు. తరువాత పరిస్థితులు మారాయి. టీడీపీ క్యాడర్ మొత్తం గులాబీ గూటికి చేరింది. అయితే ఇప్పటికీ.. టీడీపీ అభిమానులు గ్రామగ్రామాన ఉన్నారు. జెండాలూ అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

    Also Read: సాగర్ బరిలో టీడీపీ..

    గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య గెలుపొందారు. జానారెడ్డి ఓడిపోయారు.ఇప్పుడు జానారెడ్డి మళ్లీ పోటీ చేయడానికి సిద్ధం అయ్యారు. బీజేపీకి బలమైన అభ్యర్థి లేరు. క్యాడర్ కూడా పెద్దగా లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చే లీడర్లకు బీజేపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఆకర్ష్ ఉపయోగించి కొంతమందిని చేర్చుకుంది. వారిలో పోటీ చేయగలిగే సామర్థ్యం ఉన్నవార వారెవరో బీజేపీకే స్పష్టత లేదు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇక టీఆర్ఎస్ ఈసారి నోముల కుటుంబసభ్యులకు టికెటు ఇవ్వాలని అనుకోవడం లేదు. బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. అయితే తమ కుటుంబానికే టికెటు ఇవ్వాలని నోముల వారసులు.. టీఆర్ఎస్ అగ్రనేతలను కలుస్తున్నారు. అయితే దుబ్బాకలో చేసిన తప్పిదాన్ని మళ్లీ చేయకూడదని.. కేసీఆర్ భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి ప్రకటనతో ఎవరికి నష్టమో.. ఎవరికి లాభమో.. అంచనా వేయడం కష్టమే కానీ.. టీడీపీ మాత్రం పోటీకి ప్రయత్నాలు చేస్తోంది.